రూ.200 కోట్లతో స్కిల్ టెక్నాలజీ కేంద్రాలు
ABN , Publish Date - Jul 28 , 2024 | 03:03 AM
రూ.200కోట్లతో స్కిల్ డెవల్‌పమెంట్ టెక్నాలజీ కేంద్రాలు ఏర్పాటు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

త్వరలో కార్యాచరణ: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
గజపతినగరం, జూలై 27: రూ.200కోట్లతో స్కిల్ డెవల్‌పమెంట్ టెక్నాలజీ కేంద్రాలు ఏర్పాటు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. శనివారం విజయనగరం జిల్లా గజపతినగరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకువచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 10 స్కిల్ డెవల్‌పమెంట్ టెక్నాలజీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ఒక్కో కేంద్రానికి రూ.20 కోట్లు వెచ్చిస్తామని అన్నారు. అలాగే డ్వాక్రా మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో గ్రామాల్లో చిన్న చిన్న పరిశ్రమలు నెలకొల్పేందుకు రూ.5 లక్షల నుంచి రూ.10లక్షల రుణాలు ఇచ్చేందుకు చర్చలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ఎన్నారైలను భాగస్వామ్యులను చేస్తామన్నారు. వైఎస్ జగన్ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయన్నారు.