సమస్యలను పరిష్కరించండి
ABN , Publish Date - Jun 15 , 2024 | 11:53 PM
సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీని మర్తాడు టీడీపీ నాయకులు కోరారు. శనివారం ఆమెను కలిసి సమస్యలపై విన్నవించారు.
ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీని కోరిన మర్తాడు నాయకులు
గార్లదిన్నె, జూన 15: సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీని మర్తాడు టీడీపీ నాయకులు కోరారు. శనివారం ఆమెను కలిసి సమస్యలపై విన్నవించారు. మర్తాడు ప్రధాన రహదారి ఇబ్బందికరంగా ఉందని, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రోడ్డు వేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. నియోజకవర్గాన్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆమె వారికి హామీ ఇచ్చారు. అనంతరం హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజును వారి కలిశారు. టీడీపీ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు ఆవుల కృష్ణయ్య, జిల్లా అధికార ప్రతినిధి గోసుల సుబ్బయ్య, మాజీ కన్వీనర్ గోరకాటి వెంకటేసు, క్లస్టర్ ఇనచార్జి ఆవుల శీనా, కుళ్ళాయప్ప, చలపతి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.