న్యాయం అడిగితే షోకాజ్ నోటీసులా...?
ABN , Publish Date - Jan 12 , 2024 | 11:59 PM
న్యాయం కోసం పోరాడితే షోకాజ్ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని అంగన్వాడీలు మండిపడ్డారు. గార్లదిన్నె షోకాజ్ నోటీసులు దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.

ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్ : న్యాయం కోసం పోరాడితే షోకాజ్ నోటీసులు ఇవ్వడం దుర్మార్గమని అంగన్వాడీలు మండిపడ్డారు. గార్లదిన్నె షోకాజ్ నోటీసులు దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. వారు చేపట్టిన సమ్మె శుక్రవారానికి 32వ రోజుకు చేరింది. చెన్నేకొత్తపల్లిలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మెను కొనసాగించారు. వివేకానంద జయంతిని పురస్కరించుకుని శింగనమలలో అంగన్వాడీలు ధ్యానం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. రాప్తాడులో శుక్రవారం అన్ని అంగన్వాడీ కేంద్రాలకు అధికారులు నోటీసులు అతికించారు.