Share News

Sharmila : బీజేపీపై పంజా ఎప్పుడు?

ABN , Publish Date - Feb 12 , 2024 | 03:01 AM

టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడితే ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ప్రకటించారు. ఊరికో ప్యాలెస్‌ కట్టుకున్న జగన్‌.. ఉత్తరాంధ్రకు ఏం చేశాడని నిలదీశారు.

Sharmila : బీజేపీపై పంజా ఎప్పుడు?

ఒక్కసారైనా పంట నష్టపోయిన రైతులను ఆదుకున్నారా?

ఎన్నికల హామీలు మద్యం బ్రాండ్లలోనే అమలు

ఈ నియంత మళ్లీ వస్తే ప్రజాస్వామ్యం బతకదు

జగన్‌పై షర్మిల ఫైర్‌.. రోజాది ‘జబర్దస్‌’ దోపిడీ అని విసుర్లు

జగన్‌ నాలుగేళ్లు పడుకొని టీచర్‌ ఉద్యోగాలపై దగా: లోకేశ్‌

ఇక ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఉండవ్‌!

ఊరికో ప్యాలెస్‌ కట్టుకున్న జగన్‌.. ఈ ప్రాంతానికి ఏం చేశాడు?

శ్రీకాకుళం జిల్లాకు ఇచ్చిన 60 హామీల సంగతేంటి?

ఈ సీఎం ఉత్తరాంధ్రకు పట్టిన శని.. గంజాయికి రాజధానిగా మార్చేశారు

కేసుల గురించి భయపడొద్దు.. ఎక్కువ కేసులున్నవారికి నామినేటెడ్‌ పదవులు

పేటీఎం బ్యాచ్‌ కామెంట్లకు స్పందించొద్దు.. వారి కుట్రలను తిప్పికొట్టాలి

విశాఖ ఉక్కును ప్రైవేటుపరం కానివ్వం.. అవసరమైతే రాష్ట్రమే కొంటుంది

టీడీపీ యువ నేత హామీ.. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి ‘శంఖారావం’ సభలు

శ్రీకాకుళం, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడితే ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ప్రకటించారు. ఊరికో ప్యాలెస్‌ కట్టుకున్న జగన్‌.. ఉత్తరాంధ్రకు ఏం చేశాడని నిలదీశారు. తామొచ్చాక ఈ ప్రాంతం నుంచి వలసలు లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. ‘శంఖారావం’ పేరుతో శ్రీకాకుళం జిల్లాలో ప్రకటించుకుంటారు కదా.... మరి ప్రత్యేక హోదా హామీని అమలు చేయని బీజేపీపై మీ పంజా ఎప్పుడు విసురుతారు సార్‌’ అని జగన్‌ను నిలదీశారు. వైఎస్‌ హయాంలో రైతులకు ప్రాధాన్యం కల్పించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ‘‘రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు. రూ.4వేల కోట్ల తో విపత్తులు సంభవించినప్పుడు రైతులను ఆదుకుంటామని వాగ్దానం చేశారు. ఒక్క ఏడాదైనా పంట నష్టపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకున్నారా?’’ అని ప్రశ్నించారు. రాజధాని అడిగితే క్యాపిటల్‌ పేరుతో ఒక మద్యం బ్రాండ్‌, నిరుద్యోగ యువత డీఎస్సీ అడిగితే అదే పేరుతో మరో మద్యం బ్రాండ్‌... ఇలా ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీలు బ్రాందీ షాపుల్లో మాత్రమే అమలయ్యాయని ఎద్దేవా చేశారు.

సొంత చెల్లెలనే ఇంగితం లేదా

‘‘సొంత చెల్లి అనే ఇంగితజ్ఞానం లేదా నీకు. నాపైన, కుటుంబసభ్యులపైన, సన్నిహితులపైన సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా పోస్టు లు పెట్టిస్తావా? మీకు ఇళ్లలో ఆడవాళ్లు లేరా?’’ అంటూ షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్ని విమర్శలు చేసినా హోదా, పోలవరం పూర్తి, రాజధాని నిర్మాణం, ఉద్యోగాల కల్పన తదితర హామీలన్నీ నెరవేరే వరకు రాష్ట్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

రోజా జబర్దస్త్‌ దోపిడీ

నగరి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి రోజా దోపిడీని కూడా జబర్ద్‌స్తగా చేస్తున్నారని షర్మిల ఆరోపించారు. రాత్రికి రాత్రే కొండలు మాయమవుతున్నాయని, గ్రావెల్‌, మట్టి, ఇసుక, ఆఖరికి చిన్నచిన్న ఉద్యోగాల్లో సిఫారసులకు కమీషన్లు, హౌసింగ్‌ స్కీంలో రూ.కోట్ల స్కాం, వెంచర్లు వేయాలంటే రియల్టర్ల నుంచి కప్పం, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, తహసీల్దార్‌ కార్యాలయాల నుంచి నెలవారీ ముడుపులు.... అంటూ మంత్రి రోజాపై అవినీతి ఆరోపణలు చేశారు. తనపై పిచ్చివాగుడు వాగితే తెలంగాణలో బీఆర్‌ఎస్‌ మంత్రులకు పట్టిన గతే రోజాకు కూడా పడుతుందనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు.

దేనికి మీరు సిద్ధం?

‘‘మరో రూ.8 లక్షల కోట్లు అప్పులు చేసేందుకా.. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బీజేపీకి బానిసలుగా మార్చేందుకా.... మీ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టినందుకా.... 25లక్షల ఇళ్లు అని చెప్పి ఒక్క ఇల్లూ నిర్మించనందుకా.... సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తరువాతే ఓట్లు అడుగుతానని మహిళలను ఏమార్చినందుకా.... 25వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ అని ఎన్నికల ముందు 6వేల పోస్టులతో దగా డీఎస్సీ ప్రకటించినందుకా.. అధికారంలోకి వచ్చిన వారంలో ఓపీఎ్‌సను పునరుద్ధరిస్తానని ఉద్యోగులను నట్టేట ముంచినందుకా... దేనికి మీరు సిద్ధం అని ఊరూరా పోస్టర్లు వేసుకుంటున్నారు’’ అని సీఎం జగన్‌పై షర్మిల ప్రశ్నలు కురిపించారు.

Updated Date - Feb 12 , 2024 | 03:01 AM