Share News

కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటి అయిన శంకర్‌ వర్గీయులు

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:04 AM

తంబ ళ్లపల్లె నియోజకవర్గంలోని పీటీఎం, బి.కొత్తకోట, పెద్దమండ్యం, తంబ ళ్లపల్లె కురబలకోట, ములకలచెరువు, మండలాలకు చెందిన శంకర్‌వర్గీయు లు ఆదివారం రాజంపేట పార్లమెం ట్‌ బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థి అయిన నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డితో భేటి అయ్యారు.

కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటి అయిన శంకర్‌ వర్గీయులు
నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డితో కలిసి మాట్లాడుతున్న తంబళ్లపల్లె టీడీపీ నేతలు

పెద్దతిప్పసముద్రం ఏప్రిల్‌ 7 : తంబ ళ్లపల్లె నియోజకవర్గంలోని పీటీఎం, బి.కొత్తకోట, పెద్దమండ్యం, తంబ ళ్లపల్లె కురబలకోట, ములకలచెరువు, మండలాలకు చెందిన శంకర్‌వర్గీయు లు ఆదివారం రాజంపేట పార్లమెం ట్‌ బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థి అయిన నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డితో భేటి అయ్యారు. ఈ సందర్బంగా టీడీపీ నాయకులు ఆయనతో మాట్లాడు తూ తంబళ్లపల్లె నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉన్నా ఇక్కడ గత ఎన్నికల్లో వైసీ పీ విజయం సాదించినప్పటికి నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఇక్కడ టీడీ పీకి సరైన నాయకత్వం లేవపోవడంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సహకరించేవారు లేర న్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా కొత్త వ్యక్తికి టికెట్‌ కేటాయించడంతో టీడీపీ కేడర్‌ బలహీన పడిందన్నారు. కావున తంబ ళ్లపల్లె నియోజక వర్గం ఎమ్యెల్యే టికెట్‌ను మరొక్కసారి పునరాలోచించి సరైన వ్యక్తిని నియమించాలని కోరారు. అదిష్ఠానానికి తంబళ్లపల్లె విషయం తీసుకెళ్లి మంచి నిర్ణ యం తీసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో ములకలచెరువు మాజీ మార్కెట్‌ కమి టీ చైర్మన శ్రీనాథ్‌రెడ్డి, తంబళ్లపల్లె నియోజకవర్గం పోల్‌ మెనెజ్‌మెంట్‌ కుడుం శ్రీని వాసులు, మాజీ జడ్పీటీసీ గూటం ఈశ్వరప్ప, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి తమక శ్రీని వాసులు, క్టస్టర్‌ ఇంచార్జ్‌ మద్దయ్యగారిపల్లె హరి, కుడుం రంజిత, మాజీ సర్పంచ ఈవీ రమణ, పకృద్దీన పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 12:04 AM