సురేష్‌కుమార్‌కు సేవారత్న అవార్డు
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:37 AM
రాష్ట్రంలో వినియోగదారులను చైతన్య పరచడంలో విశేష కృషి చేసిన రాష్ట్ర వినియోగదారులు సంఘం ప్రధాన కార్యదర్శి సురే్‌షకుమార్‌కు వినియోగదారుల సేవారత్న అవార్డు దక్కింది.

పుట్టపర్తిరూరల్ డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వినియోగదారులను చైతన్య పరచడంలో విశేష కృషి చేసిన రాష్ట్ర వినియోగదారులు సంఘం ప్రధాన కార్యదర్శి సురే్‌షకుమార్‌కు వినియోగదారుల సేవారత్న అవార్డు దక్కింది. ఈ మేరకు పుట్టపర్తికి చెందిన సురే్‌షకుమార్‌కు విజయవాడ తుమ్మళపల్లి కళాక్షేత్రంలో మంత్రి నాదెళ్ళ మనోహర్ గురువారం ఆ అవార్డు అందజేశారు. సురేష్ మాట్లాడుతూ.. అవార్డు రావడంలో తనకు మద్దతు పలికిన వినియోగదారుల వ్యవహారాల శాఖ కమిషనర్, కలెక్టర్, జిల్లా వినియోగదారుల సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు.