అంతర్జాతీయ పోటీలకు ఎంపిక
ABN , Publish Date - Jul 31 , 2024 | 12:03 AM
నేపాల్‌లో జరిగే అంత ర్జాతీయ వాలీబాల్ పోటీల కు స్థానిక పీవీఎస్ పాఠశా లలో పదో తరగతి చదువు తున్న వెంకటేష్ ఎంపికైన ట్లు పాఠశాల చైర్మెన పీవీ నాయుడు మంగళవారం తెలిపారు.
ముదిగుబ్బ, జూలై 30: నేపాల్‌లో జరిగే అంత ర్జాతీయ వాలీబాల్ పోటీల కు స్థానిక పీవీఎస్ పాఠశా లలో పదో తరగతి చదువు తున్న వెంకటేష్ ఎంపికైన ట్లు పాఠశాల చైర్మెన పీవీ నాయుడు మంగళవారం తెలిపారు. వెంకటేష్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం తమ పాఠశాలకే గర్వకారణమన్నారు. వెంక టేష్‌ను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు క్రీడలలో రాణించాలన్నారు. అనంతరం విద్యార్థి వెంకటేష్‌కు పాఠశాల తరపున చైర్మన రూ. ఐదు వేలు, 10వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి రూ. ఏడు వేలు ఆర్థిక సాయం చేశారు.