సెజ్ భూముల్లో సేద్యం పనులు
ABN , Publish Date - Jun 17 , 2024 | 11:30 PM
మండలంలో ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) ఏర్పాటుకు సేకరించిన భూముల్లో రైతులు సేద్యం పనులకు శ్రీకారం చుట్టారు. రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి పెద్దన్న ఆధ్యర్యంలో రైతులు సోమవారం సెజ్ భూముల్లో సేద్యం పనులు మెదలెట్టారు.

మడకశిర రూరల్, జూన 17: మండలంలో ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) ఏర్పాటుకు సేకరించిన భూముల్లో రైతులు సేద్యం పనులకు శ్రీకారం చుట్టారు. రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి పెద్దన్న ఆధ్యర్యంలో రైతులు సోమవారం సెజ్ భూముల్లో సేద్యం పనులు మెదలెట్టారు. అనంతరం సీ కొడిగేపల్లిలో జంగాలపల్లి పెద్దన్న మాట్లాడారు. పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పి 2006లో వైఎస్ హయాంలో మండలంలోని సి-కోడిగేపల్లి, నల్లానయణపల్లి, కేతేపల్లి, కల్లుమర్రి, అగ్రంపల్లి తదితర గ్రామాల పరిధిలో 660 మంది రైతుల నుంచి 2200 ఎకరాల భూములను కారు చౌకగా తీసుకున్నారన్నారు. పరిశ్రమలు స్థాపించి, భూములిచ్చిన రైతు కుంటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇస్తామని నమ్మబలికారు. భూములు తీసుకుని 17 ఏళ్లయినా నేటికీ ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. దీంతో భూములిచ్చిన రైతులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు సేకరించిన ఐదేళ్లలోపు పరిశ్రమలు ఏర్పాటు చేయలేకపోతే వాటిని రైతులకు తిరిగి ఇవ్వాల్సి ఉందన్నారు. ఆ మేరకు రైతులు.. తమ భూముల్లో పంటలు వేసుకుంటున్నారని ఆయన వివరించారు.