Share News

‘నోముల’ ఎఫ్‌ఐఆర్‌లో సెక్షన్‌ 307 చేర్చాలి

ABN , Publish Date - May 29 , 2024 | 04:04 AM

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులపై ఫిర్యాదు చేసిన నోముల మాణిక్యరావు పట్ల వివక్షతో వ్యవహరిస్తున్న మంగళగిరి రూరల్‌ ఎస్సైపై చర్య తీసుకోవాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కోరారు.

‘నోముల’ ఎఫ్‌ఐఆర్‌లో సెక్షన్‌ 307 చేర్చాలి

డీజీపీకి టీడీపీ నేత వర్ల లేఖ

అమరావతి, మే 28(ఆంధ్రజ్యోతి): మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులపై ఫిర్యాదు చేసిన నోముల మాణిక్యరావు పట్ల వివక్షతో వ్యవహరిస్తున్న మంగళగిరి రూరల్‌ ఎస్సైపై చర్య తీసుకోవాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కోరారు. ఈమేరకు మంగళవారం డీజీపీకి ఆయన ఓ లేఖ రాశారు. ‘మాణిక్యరావుపై దాడి ఘటనలో ఎస్సై కేసు తీసుకోలేదు. మీరు ఆదేశించిన తర్వాత నమోదు చేసిన జీరో ఎఫ్‌ఐఆర్‌లో కూడా ఐపీసీ సెక్షన్‌ 307 చేర్చకుండా ఎస్సై వివక్ష చూపుతున్నారు. దళితుడైన మాణిక్యరావు టీడీపీ ఏజెంట్‌గా కూర్చున్నందునే అతన్ని హత్య చేసేందుకు ప్రయత్నించారు. హత్యాయత్నానికి సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలున్నా ఎఫ్‌ఐఆర్‌లో ఐపీసీ సెక్షన్‌ 307 చేర్చలేదు. దీన్ని బట్టి ఎస్సైకి వైసీపీ నేతలతో ఉన్న సంబంధాలు స్పష్టమౌతున్నాయి. మాణిక్యరావు ఎఫ్‌ఐఆర్‌లో ఆ సెక్షన్‌ చేర్చేలా మంగళగిరి రూరల్‌ పోలీసులకు తగు ఆదేశాలివ్వాలి’ అని వర్ల కోరారు.

Updated Date - May 29 , 2024 | 07:59 AM