Share News

నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు

ABN , Publish Date - Jul 28 , 2024 | 03:03 AM

ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం సాయంత్రానికి ఉత్తర ఒడిశా పరిసరాలకు చేరుకుని బలహీనపడింది.

నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు

విశాఖపట్నం, జూలై 27(ఆంధ్రజ్యోతి): ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం సాయంత్రానికి ఉత్తర ఒడిశా పరిసరాలకు చేరుకుని బలహీనపడింది. దీనిపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో కొనసాగుతోంది. దీని ప్రభావంతో శనివారం కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. రుతుపవనద్రోణి ఉత్తరాది వైపు పయనించే అవకాశం ఉన్నందున రానున్న రెండు రోజుల్లో వర్షాలు తగ్గుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తరకోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

Updated Date - Jul 28 , 2024 | 07:58 AM