Share News

రుతుపవనాలు బలహీనం

ABN , Publish Date - Jul 26 , 2024 | 03:16 AM

బంగాళాఖాతంలో అల్పపీడనాలు, రాష్ట్రంపై ద్రోణులు, ఉపరితల ఆవర్తనాలు లేకపోవడంతో రుతుపవనాలు బలహీనంగా మారాయి. దీంతో రాష్ట్రంలో అనేకచోట్ల గురువారం పొడి వాతావరణం నెలకొంది. అక్కడక్కడ మాత్రమే

రుతుపవనాలు బలహీనం

విశాఖపట్నం, జూలై 25(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అల్పపీడనాలు, రాష్ట్రంపై ద్రోణులు, ఉపరితల ఆవర్తనాలు లేకపోవడంతో రుతుపవనాలు బలహీనంగా మారాయి. దీంతో రాష్ట్రంలో అనేకచోట్ల గురువారం పొడి వాతావరణం నెలకొంది. అక్కడక్కడ మాత్రమే తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరకోస్తా తీరం వెంబడి గాలులు బలంగా వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

Updated Date - Jul 26 , 2024 | 07:17 AM