Share News

సత్యసాయి ఆంగ్ల అనువాదకులు ప్రొఫెసర్‌ అనిల్‌కుమార్‌ కన్నుమూత

ABN , Publish Date - Apr 04 , 2024 | 04:55 AM

పుట్టపర్తి సత్యసాయి బాబా ఆధ్యాత్మిక ప్రసంగ అనువాదకులు ప్రొఫెసర్‌ అనిల్‌కుమార్‌ (82) అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. ఆయన

సత్యసాయి ఆంగ్ల అనువాదకులు ప్రొఫెసర్‌ అనిల్‌కుమార్‌ కన్నుమూత

పుట్టపర్తి, ఏప్రిల్‌ 3: పుట్టపర్తి సత్యసాయి బాబా ఆధ్యాత్మిక ప్రసంగ అనువాదకులు ప్రొఫెసర్‌ అనిల్‌కుమార్‌ (82) అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. ఆయన శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు భగవాన్‌ సత్యసాయికి అత్యంత సన్నిహితంగా మెలిగారు. సత్యసాయి ప్రసంగాలను అంగ్లంలోకి అనువదించేవారు. సత్యసాయి శివైక్యం చెందిన తర్వాత దాదాపు 30 దేశాలు పర్యటించి, సత్యసాయి బోధనలను విశ్వవ్యాప్తం చేశారు.

Updated Date - Apr 04 , 2024 | 10:23 AM