Share News

నేటి నుంచి రావినూతలలో సంక్రాంతి కప్‌ క్రికెట్‌ పోటీలు

ABN , Publish Date - Jan 08 , 2024 | 11:43 PM

రావినూతల స్పో ర్ట్స్‌ అండ్‌ కల్చలర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శ్రీభమర సంక్రాంతి కప్‌ 2024, 30వ టీ20 అంతర్‌రాష్ట్ర క్రికెట్‌ పోటీలు మంగళవారం నుంచి ప్రారంభమై 16వ తేదీ వరకు జరుగుతాయని ఆర్‌ఎ్‌ససీఏ చైర్మన్‌ కారుసాల నాగేశ్వరరావు(బాబు) తెలిపారు. నాకౌట్‌ కం లీగ్‌ ప ద్ధతిలో జరిగే ఈ పోటీల్లో 16 జట్లు పాల్గొంటాయన్నారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రా ష్ట్రాల నుంచి జట్లు పోటీలలో పాల్గొంటున్నట్లు తెలిపారు.

నేటి నుంచి రావినూతలలో సంక్రాంతి కప్‌ క్రికెట్‌ పోటీలు
పోటీలకు సిద్ధమై వికెట్లతో ఉన్న టర్ప్‌ పిచ్‌

మేదరమెట్ల, జనవరి 8: రావినూతల స్పో ర్ట్స్‌ అండ్‌ కల్చలర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శ్రీభమర సంక్రాంతి కప్‌ 2024, 30వ టీ20 అంతర్‌రాష్ట్ర క్రికెట్‌ పోటీలు మంగళవారం నుంచి ప్రారంభమై 16వ తేదీ వరకు జరుగుతాయని ఆర్‌ఎ్‌ససీఏ చైర్మన్‌ కారుసాల నాగేశ్వరరావు(బాబు) తెలిపారు. నాకౌట్‌ కం లీగ్‌ ప ద్ధతిలో జరిగే ఈ పోటీల్లో 16 జట్లు పాల్గొంటాయన్నారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రా ష్ట్రాల నుంచి జట్లు పోటీలలో పాల్గొంటున్నట్లు తెలిపారు. మొదటి బహుమతిగా రూ.3లక్షలు, రెండో బహుమతిగా రూ.2 లక్షలు, మూడో బహుమతిగా రూ.లక్ష అందిస్తున్నట్లు చెప్పారు. మ్యాన్‌ఆ్‌ఫ ది టోర్నమెంట్‌, బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌, బెస్ట్‌ బౌలర్‌, బెస్ట్‌ ఫీల్డర్‌, ప్రతి పోటీలో మ్యాన్‌ఆ్‌ఫ ది మ్యాచ్‌ బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా అఖిల భారత బ్యాడ్మింటన్‌ కార్యదర్శి కరణం పున్నయ్య చౌదరి, ప్రముఖ సినీనటుడు యర్రా రఘుబాబు, శ్రీభమర టౌన్‌షి్‌ప మెనేజింగ్‌ డైరెక్టర్‌ గల్లా రామచంద్రరావు, డాక్టర్‌ బి.జవహర్‌, ప్రముఖ న్యాయవాది మోహన్‌దా్‌స హాజరవుతారని నాగేశ్వరరావు తెలిపారు.

గ్రామంలో క్రికెట్‌ సందడి

సంక్రాంతి కప్‌ కిక్రెట్‌ పోటీలు కొరిశపాడు మండలం రావినూతల గ్రామస్థులకు ఎంతో ఇష్టమైనవి. దేశ విదేశాలలో ఎ క్కడ ఉన్నా సంక్రాంతి పండుగకు గ్రామానికి రావడం, క్రికెట్‌ పోటీలను వీక్షించడం ప్రతి సంవత్సరం జరిగుతుంది. ఇక్కడకు వచ్చే క్రీడాకారులు కూడా పండుగకు తమ గ్రామానికి వెళ్తున్నట్లే భావిస్తారు. అంతర్జాతీయ క్రీడాకారులు అయిన వేణుగోపాలరావు, వెంకటపతిరాజు, టీం ఇండియా మాజీ సెలెక్టర్‌ ఎంఎ్‌సకే ప్రసాద్‌, నోయల్‌ డేవిడ్‌, రంజీ, ఐపీఎల్‌ పోటీలలో పాల్గొంటున్న ఎంతో మంది క్రీడాకారులు ఇక్కడ పోటీలలో పాల్గొన్నవారే. పోటీలలో పాల్గొనే పదహారు జట్లకు గతంలో ఎంతో వ్యయప్రయాసలు కోర్చి ఎక్కడెక్కడో బస ఏర్పాటు చేసేవారు. పెవిలియన్‌ భవనం పూర్తి అయిన తరువాత క్రీడాకారులందరికీ స్టేడియంలోనే బస ఏర్పాటుచేశారు. గత 30 ఏళ్లగా ఇక్కడ పోటీలలో పాల్గొనే ఆటగాళ్లకు ఉచిత వసతి, భోజనం, ఆర్‌ఎ్‌ససీఏ వాళ్లే ఏర్పాటు చేస్తున్నారు.

Updated Date - Jan 08 , 2024 | 11:43 PM