ఘనంగా శంకర జయంతి ఉత్సవాలు
ABN , Publish Date - May 12 , 2024 | 11:37 PM
ఆది శంకరాచార్యుల జయంతిని ఆదివారం పీలేరులోని శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు.

పీలేరు, మే 12: ఆది శంకరాచార్యుల జయంతిని ఆదివారం పీలేరులోని శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎనటీఆర్ నగర్‌లోని బ్రా హ్మణ సంఘ కమ్యూనిటీ హాలులో ఆదివారం ఉదయం స్వా మి వారికి రుద్రాభిషేకం, అష్టోత్తర శతనామావళి, మహిళలు లలితా సహస్రనామావళి నిర్వహించారు. అనంతరం ఆది శంకరాచార్యుల చిత్రపటానికి పూలమాలలు సమర్పించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ సభ్యు లు ఉద్యా ఫణీంద్ర శర్మ, రెడ్డిసుబ్రహ్మణ్యం, సూత్రం కిరణ్ కుమా ర్ శర్మ, అప్పిస్వామి, ఆనంద్ స్వామి, కృష్ణప్రసాద్ స్వామి, సంతోశ స్వామి, తెనాలి గిరిధర్ రావు, శ్రీకాంత, లలితాంబ, రెడ్డిభావిక, మధుబాల, భరత పాల్గొన్నారు.
మదనపల్లి అర్బనలో: స్థానిక కురవంకలో బ్రాహ్మణ సేవా సమితి కార్యాలయంలో ఆదిశంకరాచార్యుల జయంతి ఉత్సవా లు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శివస్వామి, చ లపతి స్వామి రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు కోదండరామయ్య మా ట్లాడుతూ శ్రౌత, స్మార్తక కర్మలను పునర్ధురించి వైదిక మతా న్ని పునఃస్థాపితం చేయడానికి స్వయంగా శంకరుడే భూమి పై అవతరించాడన్నారు. ఆ వైదిక ధర్మాన్ని ప్రతిష్ఠించి నిరం తరంగా కొనసాగడానికి ఆసేతుహిమాచలం వరకు కాలిన డకన మూడు సార్లు పర్యటించి దేశానికి నలువైపులా నాలు గు పీఠాలను స్తాపించిన మహనీయ్యుడు శంకరాచార్యులు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో శంకర బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కోదండరామయ్య గౌరవాధ్యక్షుడు కామకోటి ప్రసా ద్‌రావు , రఘునందన ప్రకాశ , కేశవాచార్యులు , సి ప్రకాశ , యూటీఐ మధు , శర్మఅమర్నాథ్ తదితరుతు పాల్గొన్నారు.