Share News

శానిటరీ ప్యాడ్స్‌ పక్కదారి!

ABN , Publish Date - Feb 29 , 2024 | 03:35 AM

ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు అందాల్సిన శానిటరీ ప్యాడ్స్‌ (శానిటరీ న్యాప్కిన్స్‌) పక్కదారి పడుతున్నాయి. కర్నూలు జిల్లా ఆదోని పట్టణ శివారులోని భరత్‌నగర్‌

శానిటరీ ప్యాడ్స్‌ పక్కదారి!

ఆదోని వద్ద పొలంలో భారీగా నిల్వ

విద్యార్థినులకు పంపిణీ చేయకుండా ఇక్కడెందుకో!?

ఆదోని (అగ్రికల్చర్‌), ఫిబ్రవరి 28: ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు అందాల్సిన శానిటరీ ప్యాడ్స్‌ (శానిటరీ న్యాప్కిన్స్‌) పక్కదారి పడుతున్నాయి. కర్నూలు జిల్లా ఆదోని పట్టణ శివారులోని భరత్‌నగర్‌ వద్ద ఓ పొలంలో వందలకొద్ది బాక్సుల్లో శానిటరీ ప్యాడ్స్‌ కనిపించాయి. అసలు వీటిని అక్కడ ఎవరు ఉంచారో? ఎందుకు ఉంచారో? ఎవరికీ తెలియడం లేదు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్‌ను పంపిణీ చేస్తోంది. వాటిని నేరుగా జిల్లా విద్యాశాఖ నుంచే పాఠశాలలకు కాంట్రాక్టర్ల ద్వారా పంపిణీ చేయాలి. అలా కాకుండా వ్యవసాయ పొలంలో ఇలా లారీకి సరిపడా బాక్సులను దాచారు. పొలంలోని ఓ వ్యక్తిని విచారించగా అది ఆదోని మండలానికి సంబంధించింది కాదని, గూడూరుకు సరఫరా చేస్తున్నామని, స్థలం లేక పొలంలో నిలువ ఉంచినట్లు తెలిపారు. అయితే సదరు వ్యక్తి తన వివరాలను తెలిపేందుకు నిరాకరించారు. ఆదోని ఎంఈఓ శ్రీనివాసులు ను వివరణ కోరగా శానిటరీ ప్యాడ్స్‌ను ప్రభుత్వం నేరుగా జిల్లా కేంద్రాల నుంచి కాంట్రాక్టర్‌కు అప్పజెప్పి పాఠశాలలకు సరఫరా చేస్తుందన్నారు. పొలంలో వాటిని ఎందుకు దాచిఉంచారో విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - Feb 29 , 2024 | 03:35 AM