Share News

ఇసుక అక్రమార్కుల మధ్య ఆధిపత్య పోరు

ABN , Publish Date - Dec 28 , 2024 | 05:09 AM

బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో ఇసుక అక్రమార్కుల మధ్య ఆధిపత్య పోరు ఎక్స్‌కవేటర్‌ను తగులబెట్టుకునే వరకూ వెళ్లింది. ఒకరు ఎంపీ పేరుతో, మరొకరు ఎమ్మెల్యే పేరుతో దందా సాగిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.

ఇసుక అక్రమార్కుల మధ్య ఆధిపత్య పోరు

ఎమ్మెల్యే పేరుతో ఒకరు, ఎంపీ పేరుతో మరొకరు

బాపట్ల జిల్లాలో ఒకరి ఎక్స్‌కవేటర్‌కు నిప్పు.. కేసు నమోదు

చీరాల, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో ఇసుక అక్రమార్కుల మధ్య ఆధిపత్య పోరు ఎక్స్‌కవేటర్‌ను తగులబెట్టుకునే వరకూ వెళ్లింది. ఒకరు ఎంపీ పేరుతో, మరొకరు ఎమ్మెల్యే పేరుతో దందా సాగిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. చీరాల మండలం బోయినవారిపాలెంలో శుక్రవారం తెల్లవారుజామున ఇసుక అక్రమ తవ్వకాలు జరిగే ప్రదేశానికి సమీపంలో ఒకరి ఎక్స్‌కవేటర్‌ను మరోవర్గం వారు తగులబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు సంబంధించి వాస్తవ పరిస్థితులను కలెక్టర్‌ జె.వెంకటమురళికి సమగ్ర నివేదిక ఇచ్చేందుకు అధికారులు సమాయత్తమైనట్లు సమాచారం. ఈ ఘటనపై ఈపురుపాలేనికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ చంద్రశేఖర్‌ తెలిపారు.

Updated Date - Dec 28 , 2024 | 05:09 AM