Share News

సజ్జల భార్గవ్‌ కేసు విచారణ వాయిదా

ABN , Publish Date - Dec 28 , 2024 | 04:20 AM

రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో తనపై బహుళ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడాన్ని సవాల్‌ చేస్తూ వైసీపీ సోషల్‌ మీడియా మాజీ కన్వీనర్‌ సజ్జల భార్గవ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది.

సజ్జల భార్గవ్‌ కేసు విచారణ వాయిదా

అమరావతి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్లలో తనపై బహుళ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడాన్ని సవాల్‌ చేస్తూ వైసీపీ సోషల్‌ మీడియా మాజీ కన్వీనర్‌ సజ్జల భార్గవ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. హోంశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది జయంతి స్పందిస్తూ.. ఈ వ్యవహారంపై అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తారని తెలిపారు. కేసు తొలిసారి విచారణకు వచ్చింద ని, వివరాల సమర్పణకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణను జనవరి 3కి వాయిదా వేశారు. సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడంతో పాటు అనుచిత పోస్టులు పెట్టేలా ప్రోత్సహించారనే ఆరోపణలపై శ్రీసత్యసాయి జిల్లా, రొద్దం పోలీసులు నమోదు చేసిన కేసును మొదటి ఎఫ్‌ఐఆర్‌గా, ఇదే వ్యవహారంపై వివిధ పోలీస్‌ స్టేషన్లలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు అన్నింటినీ వాంగ్మూలాలుగా పరిగణించేలా ఆదేశాలు ఇవ్వాలని భార్గవ్‌ తన పిటిషన్‌లో కోరారు. మరోవైపు సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ సజ్జల భార్గవ్‌రెడి, వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు దాఖలు చేసిన పలు వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు వచ్చేనెల 3కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.విజయ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Dec 28 , 2024 | 04:20 AM