Share News

సాయిప్రసాద్‌ అవుట్‌!

ABN , Publish Date - Jan 12 , 2024 | 04:37 AM

ఎల్వీ ప్రసాదన్న, సవాంగన్న, రమేశన్న, నీరబ్‌కుమారన్న.. ఇప్పుడు సాయిప్రసాదన్న. జగన్‌, ఆయన కార్యాలయ వేధింపులకు గురయిన బాధితుల జాబితాలో కొత్తగా సాయిప్రసాద్‌ అన్న కూడా చేరారు.

సాయిప్రసాద్‌ అవుట్‌!

సాయిప్రసాద్‌ అవుట్‌!

రెవెన్యూ స్పెషల్‌ సీఎస్‌గా తొలగింపు

జగన్‌ బాధితుల జాబితాలో మరో ‘అన్న’

ప్రస్తుతం సెలవులో ఉన్న సాయిప్రసాద్‌

ముగిశాక ఆ పోస్టుతో పాటు సీసీఎల్‌ఏగా

కొనసాగుతారని తొలుత ఉత్తర్వులు

అప్పటిదాకా ఇంతియాజ్‌కు

అప్పగిస్తూ 4న జీవో జారీ

వారం తిరగకముందే తెరపైకి జైన్‌

ఆయనకు రెవెన్యూ అదనపు బాధ్యతలు

సాయిప్రసాద్‌ వెనక్కి తిరిగొచ్చాక

మళ్లీ సీసీఎల్‌ఏ ఇస్తారా..?

రెవెన్యూ స్పెషల్‌ సీఎస్‌గా ఉంటారా?

ఐఏఎస్‌ వర్గాల్లో ఇప్పుడిదే చర్చ

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఎల్వీ ప్రసాదన్న, సవాంగన్న, రమేశన్న, నీరబ్‌కుమారన్న.. ఇప్పుడు సాయిప్రసాదన్న. జగన్‌, ఆయన కార్యాలయ వేధింపులకు గురయిన బాధితుల జాబితాలో కొత్తగా సాయిప్రసాద్‌ అన్న కూడా చేరారు. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ (1991 బ్యాచ్‌) జి.సాయిప్రసాద్‌ను ఆ పోస్టు నుంచి తొలగిస్తూ సర్కారు తాజాగా ఉత్తర్వులు (జీవో 76) జారీ చేసింది. అదే బ్యాచ్‌కు చెందిన మరో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అజయ్‌ జైన్‌కు అదనంగా ఆ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవర కు ఆ పోస్టులో ఆయనే కొనసాగుతారని సీఎస్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం సాయిప్రసాద్‌ సెలవులో ఉన్నారు. కుమార్తె పెళ్లిపనుల్లో ఆయన తీరిక లేకుండా ఉన్నారు. ఇటు సీసీఎల్‌ఏగా, అటు రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్‌ ఇంతియాజ్‌కు అదనపు బాధ్యతలు అప్పస్తూ ఈ నెల 4వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో 18) జారీ చేసింది. సాయిప్రసాద్‌ సెలవు ముగించుకుని తిరిగొచ్చాక ఈ జోడు పదవుల్లో కొనసాగుతారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి చాలా స్పష్టంగా అందులో పేర్కొన్నారు. సరిగ్గా వారం రోజుల వ్యవధిలో ఏం జరిగిందో.. అజయ్‌ జైన్‌ తెరపైకి వచ్చారు. జైన్‌ ప్రస్తుతం గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఓ ముఖ్య అధికారికి, సాయిప్రసాద్‌కు ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు పొడసూపినట్లు తెలిసింది. తన వద్ద పనిచేసే అధికారి మాటలకే ముఖ్యమంత్రి విలువ ఇస్తున్నట్లు తెలిసింది. నాలుగైదు రోజుల క్రితమే సాయిప్రసాద్‌ను మార్చాలన్న ప్రతిపాదనలు రాగా ఎందుకో ముందుకు సాగలేదు. కానీ గురువారం సదరు ముఖ్య అధికారి పట్టుబట్టి మరీ ఈ ఉత్తర్వు ఇప్పించినట్లు ఐఏఎస్‌ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

సీఎస్‌ తర్వాత రెండో స్థానం

ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తర్వాత సీసీఎల్‌ఏ పోస్టు నంబర్‌ టూ. లోగడ మన్మోహన్‌సింగ్‌ ఇటు రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యద ర్శిగా, సీసీఎల్‌ఏగా ఏక కాలంలో రెండు పోస్టులు నిర్వహించారు. ఆయన రిటైరయ్యేవరకు వాటిలో కొనసాగారు. తర్వాత నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ను కూడా రెండు పదవుల్లో కొంతకాలం కొనసాగించారు. రెవెన్యూలోనే ఓ జూనియర్‌ అధికారి రాజేసిన ముసలంతో నీరబ్‌ను రెండు పోస్టుల నుంచి తప్పించి... అటవీశాఖకు పంపుతూ ఉత్తర్వు ఇచ్చారు. అది జరిగిన 48 గంటల్లోనే ఆయన్ను తిరిగి సీసీఎల్‌ఏగా కొనసాగిస్తూ మరో ఉత్తర్వు ఇచ్చారు. కొద్దిరోజుల తర్వాత ఆయన్ను ఆ పోస్టు నుంచి కూడా తీసేసి తిరిగి అటవీశాఖకు పంపించారు. తర్వాత సాయిప్రసాద్‌ను నియమించారు. ఈయనకూ రెండు పోస్టులు ఇచ్చారు. సీఎంవో ముఖ్య అధికారితో పలు అంశాల్లో ఆయనకు అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు తెలిసింది. తన మాట వినడం లేదని సదరు అధికారి సీఎంకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. తొలుత జగన్మోహన్‌రెడ్డి పట్టించుకోలేదు. ఇప్పుడు సాయిప్రసాద్‌ సెలవులో ఉన్న సమయం చూసి ఆయన్ను రెవెన్యూ నుంచి తప్పించడంలో ఆ అధికారి కృతకృత్యులయ్యారు. నిజానికి ఆయన గత ప్రభుత్వంలో చంద్రబాబు వద్ద ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో సీఎంవోలో పనిచేశారు. జగన్‌ సర్కారు వచ్చాక చంద్రబాబు వద్ద పనిచేసిన అధికారులకు కీలకపోస్టులు ఇవ్వలేదు. కానీ సాయిప్రసాద్‌ను తొలుత విద్యుత్‌ శాఖలో, ఆ తర్వాత రెవెన్యూలో నియమించారు. ప్రభుత్వంలో సీఎస్‌ త ర్వాత నంబర్‌ 2 పోస్టు అయిన సీసీఎల్‌ఏగా ఆయనకు అవకాశం ఇచ్చారు. కానీ సీఎంవోలో పనిచేసే అధికారితో మొదలైన వివాదం అనేక మలుపులు తిరిగి చివరకు పోస్టు నుంచి తప్పిచేదాకా వెళ్లినట్లు ఐఏఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. గతంలో సీఎ్‌సగా పనిచేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఆర్థిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ పీవీ రమేశ్‌, స్పెషల్‌ సీఎస్‌ నీరబ్‌కుమార్‌లను రాత్రికి రాత్రి బదిలీ చేసిన జగన్‌.. ఇప్పుడు సెలవులో ఉన్న సాయిప్రసాద్‌పై గురిపెట్టారన్న చర్చ ఐఏఎస్‌ వర్గాల్లో సాగుతోంది.

Updated Date - Jan 12 , 2024 | 04:38 AM