మట్టిలో మాణిక్యం
ABN , Publish Date - Mar 03 , 2024 | 11:46 PM
మద్దికెర గ్రామంలో నివసించే జమేదార్ నీలకంఠరాయుడు, జమేదార్ ధనలక్ష్మి రెండో కుమారుడైన జమేదార్ హర్షవర్థన్ రాయుడు అగ్రికల్చర్‌లో కంది పంట తక్కువ పెట్టుబడి, తొందరలో దిగుబడి అనే అంశంపై పట్టుదలతో చదివి డాక్టరేట్ పొందాడు.
కంది పంట పరిశోధనలో డాక్టరేట్
శభాష్ జమేదార్ హర్షవర్థన్ రాయుడు
మద్దికెర, మార్చి 3 : మద్దికెర గ్రామంలో నివసించే జమేదార్ నీలకంఠరాయుడు, జమేదార్ ధనలక్ష్మి రెండో కుమారుడైన జమేదార్ హర్షవర్థన్ రాయుడు అగ్రికల్చర్‌లో కంది పంట తక్కువ పెట్టుబడి, తొందరలో దిగుబడి అనే అంశంపై పట్టుదలతో చదివి డాక్టరేట్ పొందాడు. 1వ తరగతి నుంచి 10 వరకు గుంటూరు లయోలా పబ్లిక్ స్కూల్‌లో చదివి.. ఇంటర్‌లో శ్రీచైతన్య విద్యాలయంలో పూర్తి చేశాడు. బాపట్లలోని ఆచార్య ఇంజనీరింగ్ కళాశాలలో అగ్రికల్చర్ బీఎస్సీ నాలుగేళ్లు చదివి విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఆ తర్వాత మేఘాలయలో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలిలోని పీజీలో చేరి కంది పంటలో జన్యుపరిశోధనలో శాస్త్రవేత్తగా రాణించి పీజీ పూర్తి చేశాడు. హైదరాబాదులోని రాఘవేంద్రనగర్‌లో గల ఇక్రిషాట్‌లోగల నాలుగేళ్లు కంది పంటపైన మూడేళ్ల పాటు పరిశోధన చేశాడు. దీనికి ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ గూంటూరు డాక్టరేట్‌ను అందజేశారు. టీడీపీ నాయకులు నగిరి క్రిష్టన్న, రఘు యాదవ్ అభినందించారు.