రూ.2.07 కోట్ల గోవా మద్యం పట్టివేత
ABN , Publish Date - May 12 , 2024 | 04:01 AM
ఏపీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పెద్దఎత్తున గోవా మద్యం తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు తెలంగాణలోని పాలమూరు పోలీసులు చెక్‌పెట్టారు.

ఎరువుల బస్తాల మాటున లారీలో తరలింపు
మహబూబ్‌నగర్/బాలానగర్, మే 11: ఏపీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పెద్దఎత్తున గోవా మద్యం తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు తెలంగాణలోని పాలమూరు పోలీసులు చెక్‌పెట్టారు. గోవా నుంచి రాజమండ్రికి సినీఫక్కీలో పలుచెక్‌పో్‌స్టలు, పోలీస్ స్టేషన్లు దాటుకుంటూ తరలిస్తున్న 2000 మద్యం బాక్సులున్న లారీని మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ జాతీ య రహదారిపై పోలీసులు పట్టుకున్నారు. మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు కథనం మేరకు.. గోవాలో జాకబ్ అనే వ్యకి లారీలో రూ.2.07 కోట్ల విలువల చేసే 2000 బాక్సుల క్వార్టర్ సీసాల మద్యం రాజమండ్రికి తరలించేందుకు లోడ్ చేసి పంపించారు. తొలుత బెల్గాం వరకు వచ్చిన డ్రైవర్లు.. అక్కడ మరో ఇద్దరు డ్రైవర్లకు లారీని అప్పగించారు. లారీలో ఏమున్నదో కూడా డ్రైవర్లకు చెప్పకుండా రాజమండ్రి వెళ్లిన తరువాత జాకబ్ అనే వ్యక్తికి ఫోన్ చేయాలని నంబర్ ఇచ్చారు. అయితే ముందస్తు సమాచారం రావడం తో శుక్రవారం అర్ధరాత్రి 11 గంటల తరువాత బాలానగర్ పోలీసులు, రంగారెడ్డి జిల్లా ఎన్ ఫోర్స్‌మెంట్ ఎక్పైజ్ సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో లారీ రా గానే ఆపి స్టేషన్‌కు తరలించారు. అందులో పైన ఎరువుల బస్తాలు, కింద మద్యం బాక్సులు ఉండడంతో సీజ్ చేసి డ్రైవర్లు లాల్ భరత్‌రావు, ఉద్దవ్‌పాండులను అదుపులోకి తీసుకున్నారు. తమకు ఏమీ తెలియదని, రాజమండ్రి వెళ్లాక జాకబ్ అనే వ్యక్తికి ఫోన్ చేస్తే ఎక్కడికి తీసుకెళ్లాలో చెబుతారని మాత్రమే వారు చెప్పారన్నారు. జాకబ్‌కు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ స్విచా ఫ్ చేసి ఉండటంతో.. పట్టుకున్న మద్యాన్ని ఎక్సైజ్ పో లీసులకు అప్పగించారు. దీనిపై దర్యాప్తు చేసి వివరాలు వెల్లడిస్తామని డీ ఎస్పీ తెలిపారు.