Share News

పర్చూరు ఎమ్మెల్యేపై రెవెన్యూ కక్షపూరిత ధోరణి

ABN , Publish Date - Jan 28 , 2024 | 03:05 AM

అధికారపార్టీ ఓట్ల అక్రమాలపై పోరాటం చేస్తున్న పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుపై రెవెన్యూ అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ‘

పర్చూరు ఎమ్మెల్యేపై రెవెన్యూ కక్షపూరిత ధోరణి

అధికారపార్టీ ఓట్ల అక్రమాలపై పోరాటం చేస్తున్న పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుపై రెవెన్యూ అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ‘ ప్రతిపక్షాల ఓట్లు తొలగించాలని అధికారపార్టీ పెద్దఎత్తున ఫారం7, నమోదు కోసం ఫారం 6లు ఇవ్వడంపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకి సాంబశివరావు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారపార్టీ నేతల ఆదేశాలతో ఏపీడీఆర్‌ఐ అధికారులు ఎమ్మెల్యేపై కక్ష సాధింపులకు దిగారు. సాంబశివరావు వ్యాపారాలపై, ఆస్తులపై దాడులు చేస్తూ తప్పుడు కేసులు పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సాంబశివరావు కంపెనీలో పనిచేసిన ఉద్యోగి నోట్‌బుక్‌లో 2019 ఎన్నికల్లో ఆయన నగదు పంపిణీ చేసినట్లు ఆధారాలు దొరికాయని డీఆర్‌ఐ అధికారులు చెప్తున్నారు. సాంబశివరావు కంపెనీ సేల్స్‌ టాక్స్‌ చెల్లించలేదనే నెపంతో ఆయన కంపెనీపై అన్యాయంగా దాడులు చేశారు’ అని అచ్చెన్న తెలిపారు.

Updated Date - Jan 28 , 2024 | 10:02 AM