అమరావతిలోనే రిపబ్లిక్ వేడుకలు!
ABN , Publish Date - Nov 28 , 2024 | 06:33 AM
రిపబ్లిక్ డే(జనవరి 26) వేడుకలను ఈసారి రాజధాని అమరావతిలో నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాయపూడి సీడ్ యాక్సెస్

తుళ్లూరు, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): రిపబ్లిక్ డే(జనవరి 26) వేడుకలను ఈసారి రాజధాని అమరావతిలో నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే టవర్ల సమీపంలో ఎన్‌ఆర్టీ టవర్స్‌కు వెళ్లే మార్గంలో ఉన్న స్థలాన్ని సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ముఖ్యమంత్రి కార్యాలయ(జీఏడీ) అధికారి సురేశ్‌కుమార్, ఏఎస్పీ ఏటీవీ రవి, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ బుధవారం పరిశీలించారు.