Share News

12 మంది వైసీపీ నేతలకు గన్‌మేన్ల తొలగింపు

ABN , Publish Date - Feb 27 , 2024 | 11:49 PM

కనీస నిబంధనలు పాటించకండా అధికారం మాటున వైసీపీ నేతలకు అడ్డగోలుగా ఇచ్చిన గన్‌మేన్ల సదుపాయాన్ని ఎట్టకేలకు 12 మందికి తొలగించారు. ఎవరికయినా భద్రత కల్పించాలంటే సెక్యూరిటీ రివ్యూ కమిటీ నిర్ణయం మేరకు గన్‌మేన్లను ఇస్తుంటారు.

12 మంది వైసీపీ నేతలకు గన్‌మేన్ల తొలగింపు

ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి ఫిర్యాదు ఫలితం

(కడప-ఆంధ్రజ్యోతి): కనీస నిబంధనలు పాటించకండా అధికారం మాటున వైసీపీ నేతలకు అడ్డగోలుగా ఇచ్చిన గన్‌మేన్ల సదుపాయాన్ని ఎట్టకేలకు 12 మందికి తొలగించారు. ఎవరికయినా భద్రత కల్పించాలంటే సెక్యూరిటీ రివ్యూ కమిటీ నిర్ణయం మేరకు గన్‌మేన్లను ఇస్తుంటారు. అయితే జిల్లాలో అధికార పార్టీ నేతలు ఎవరికి చెబితే వారికి గన్‌మేన్ల సౌకర్యం ఇచ్చారు. అధికార పార్టీ అనేదే అర్హతగా ఎలాంటి ముప్పులేని వైసీపీ నేతలకు కూడా భద్రత కల్పించారు. ఈ అవకా శాన్ని వారు దుర్వినియోగం చేస్తున్నట్లు విమర్శలున్నాయి. సార్వత్రిక ఎన్నికలవేళ అనధికారికంగా ఇచ్చిన గన్‌మేన్లను తొలగించడంతో పాటు ప్రతిపక్ష నేతలకు కూడా సరైన భద్రత కల్పించాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి ఈ నెల 12న ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ మేరకు.. వేంపల్లె ఎంపీపీ రవికుమార్‌రెడ్డి, అగ్రికల్చర్‌ అడ్వయిజర్‌ తిరుపాల్‌రెడ్డి, ఏపీపీఎస్‌ మెంబరు నిమ్మకాయల సుధాకర్‌రెడ్డి, సింహాద్రిపురానికి చెందిన వైసీపీ లీడరు హరినాథరెడ్డి, సింహాద్రిపురం మండల ఉపాధ్యక్షుడు దేవిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, లింగాల మండలంలోని గుణకన పల్లెకు చెందిన జీవీ క్రిష్ణారెడ్డి, సూర్యనారాయణరెడ్డి, పులివెందులకు చెందిన పుష్పనాధరెడ్డి, క్రిష్ణారెడ్డి, ఏవీ భాస్కర్‌రెడ్డి, ముద్దనూరుకు చెందిన మునిరాజారెడ్డి, ముద్దనూరు ఎంపీపీ ప్రదీప్‌ రెడ్డి, కడపకు చెందిన చింతలకుంట రమేశ్‌రెడ్డి, ప్రొద్దుటూరుకు చెందిన కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, కాశినాయన మాజీ మండల అధ్యక్షుడు విశ్వనాథరెడ్డి, ఇండస్ట్రియల్‌ అడ్వయిజరు రాజోలి వీరారెడ్డి, ఎర్రగుంట్ల మున్సిసల్‌ చైర్మన్‌ హర్షవర్ధన్‌రెడ్డి, కడప డిప్యూటీ మేయరు బండి నిత్యానందరెడ్డి, పోరుమామిళ్లకు చెందిన ఏపీ స్టేట్‌ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ విజయప్రతా్‌పరెడ్డి, జడ్పీ చైర్మన్‌ అమర్‌ నాధరెడ్డిలకు 1ప్లస్‌ 1 గన్‌మెన్ల సౌకర్యాలు ఉన్నాయంటూ ఎమ్మెల్సీ ఈసీ కమిషన్‌ దృష్టికి తీసు కెళ్లారు. దీన్ని పరిశీలించిన ఎన్నికల కమిషన్‌ వీరిలో 12 మందికి గన్‌మేన్ల సౌకర్యాన్ని తొలగించింది.

Updated Date - Feb 27 , 2024 | 11:49 PM