Share News

ఏపీ నుంచి రిలీవ్‌ చేయండి: తెలంగాణ ఉద్యోగులు

ABN , Publish Date - Jul 05 , 2024 | 06:16 AM

ఏపీ నుంచి తమను రిలీవ్‌ చేయాలని తెలంగాణ నేటివ్‌ ఎంప్లాయిస్‌ వర్కింగ్‌ ఇన్‌ సీమాంధ్ర అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రాన్ని అందజేసినట్లు అసోసియేషన్‌

ఏపీ నుంచి రిలీవ్‌ చేయండి: తెలంగాణ ఉద్యోగులు

అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): ఏపీ నుంచి తమను రిలీవ్‌ చేయాలని తెలంగాణ నేటివ్‌ ఎంప్లాయిస్‌ వర్కింగ్‌ ఇన్‌ సీమాంధ్ర అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రాన్ని అందజేసినట్లు అసోసియేషన్‌ నేతలు గురువారం చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ నేటివ్‌ ఉద్యోగులను ఏపీకి కేటాయించారు. వారిలో కొందరు తిరిగి తెలంగాణకు వెళ్లిపోయారు. మిగిలిన వారిని కూడా పంపాలని వారు తాజాగా కోరారు. పదేళ్లయినా తమను స్వరాష్ట్రానికి పంపకపోవడం పట్ల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ సీఎంలు 6న భేటీ కానున్న నేపథ్యంలో తమ సమస్యపై చర్చిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - Jul 05 , 2024 | 06:16 AM