28న పీఎం కిసాన్ సొమ్ము విడుదల
ABN , Publish Date - Feb 27 , 2024 | 03:49 AM
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 16వ విడత సొమ్మును ఈనెల 28న జమ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెబ్‌సైట్‌లో ప్రకటించింది.
అమరావతి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 16వ విడత సొమ్మును ఈనెల 28న జమ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ కంప్యూటర్‌లో బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు. ఒక్కో రైతుకు రూ.2 వేలు చొప్పున జమ కానున్నాయి. పీఎం కిసాన్ లబ్ది కోసం రైతులు ఈ-కేవీసీ విధిగా నమోదు చేసుకోవాలని కేంద్రం సృష్టం చేసింది. పీఎం కిసాన్ పోర్టల్‌లో ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీ నమోదుకు అవకాశం కల్పించింది. పీఎం కిసాన్‌ను అనుసంధానం చేసుకున్న ఏపీ ప్రభుత్వం... రైతు భరోసా మూడో కిస్తీ ఎప్పుడు చెల్లిస్తుందో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.