మాల్స్ కోసం వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేయండి : బీవీ
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:12 AM
మెప్మా ఆధ్వర్యంలో పట్టణంలో ఏర్పాటు చేసేందుకు ఎస్‌ఎల్‌ఎఫ్‌ల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని వెంటనే తిరిగ చెల్లించాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆదేశించారు.

ఎమ్మిగనూరు, జూన్16: మెప్మా ఆధ్వర్యంలో పట్టణంలో ఏర్పాటు చేసేందుకు ఎస్‌ఎల్‌ఎఫ్‌ల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని వెంటనే తిరిగ చెల్లించాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆదేశించారు. ఆదివారం పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో మెప్మా పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ఎన్ని పొదుపు గ్రూపులు ఉన్నాయి.. ఎంతమంది సభ్యులు ఉన్నారు.. ఆర్పీలు ఎంతమంది ఉన్నారు, పర్యవేక్షులు ఎంత మంది ఉన్నారు.. గ్రూపులకు బ్యాంకుల నుంచి ఎంత మేర రుణాలు ఇచ్చారు తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాల్స్ ఏర్పాటు కోసం రూ. 20లక్షలు ఎస్‌ఎల్‌ఎఫ్‌ల నుంచి వసూలు చేసి ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదని, ఆ మొత్తాన్ని మీ దగ్గరే ఎలా ఉంచుకుంటారని పట్టణ సమైఖ్య గ్రూపు లీడర్‌ను ప్రశ్నించారు. ఇందుకు ఆమె స్పందింస్తు వసూలు చేసిన మొత్తం బ్యాంకులో ఉందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మొత్తాన్ని వెంటనే ఎస్‌ఎల్‌ఎఫ్‌లకు ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం టిడ్కో గృహాలు ఇవ్వకుండానే వారికి బ్యాంకులో రుణాలు ఎలా ఇప్పిస్తారని ప్రశ్నించారు. లబ్దిదారులనుంచి అనవసరంగా వడ్డీ కట్టిస్తున్నట్లే కదా అని ప్రశ్నించారు. ఇందుకు అధికారులనుంచి, సిబ్బందినుంచి సరైన సమాధానం రాకపోంటంతో ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. పట్టణంలో షెల్టర్లు ఎన్ని ఉన్నాయని అవి ఎక్కడ ఉన్నాయని అధికారులను అడిగారు. పట్టణంలోని వీవర్స్ కాలనీలో ఒక షెల్టర్ ఉందని ఆవార్డుకు చెందిన ఆర్పీ చెప్పటంతో ఎంత మంది ఆశ్రయం పొందుతున్నారని, దాని నిర్వహణకు ఎంత వెచ్చిస్తున్నారని ప్రశ్నించారు. ఇందుకు పీఓ, ఆర్పీ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ఒకసారి 20మంది అని, మరోసారి 15 మంది అని చెప్పుకు రావటంతో సరైన సమాధానం చెప్పాలని లేని పక్షంలో ఇప్పుడే వెళ్లి చూడాల్సి వస్తుందని అన్నారు. దీంతో ఐదు మంది ఉండోచ్చని చెప్పుకోచ్చారు. షెల్టర్లు ఉండేది రాజకీయ నాయకుల కోసమా.. లేక నిరాశ్రయిల కోసమా అంటూ నిలదీశారు. మెప్మాపై మరో సారి సమీక్ష చేస్తానని ఆపాటికి అన్ని సక్రమంగా ఉండాలని లేని పక్షంలో తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, పీఓ జయవర్ధన్, ఆర్పీలు పాల్గొన్నారు.
సీసీ రోడ్డుపనులకు భూమి పూజ : పట్టణంలోని నాలుగో వార్డులో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తామన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ రామదాసు గౌడ్, నాయకులు కొండయ్య చౌదరి, రామకృష్ణ నాయుడు, రంగస్వామి గౌడ్, చేనేత మల్లి, సుందరాజు, పెద్ద రంగన్న, బచ్చాల రంగన్న, రవి, భాస్కర్, బచ్చాల రంగన్న, కృష్ణ, ఇబ్రహీంలు పాల్గొన్నారు.