రావులచెరువు కెనాల్ జంగిల్ క్లియరెన్స
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:05 PM
ధర్మవరం చెరువు నుంచి రావులచెరువు వరకు ఉన్న కెనాల్‌లో జంగిల్ క్లియరెన్స చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ధర్మవరం చెరువు కింద ఉన్న కెనాల్ కంపచెట్లు, మట్టితో పూడుకుపోయింది.

ధర్మవరం, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : ధర్మవరం చెరువు నుంచి రావులచెరువు వరకు ఉన్న కెనాల్‌లో జంగిల్ క్లియరెన్స చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ధర్మవరం చెరువు కింద ఉన్న కెనాల్ కంపచెట్లు, మట్టితో పూడుకుపోయింది. దీంతో కెనాల్ నుంచి పలు గ్రామాలకు సాగునీరు అందక ఆయా గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆయకట్టు రైతులు ఇరిగేషన అధికారులు, పాలకులకు ఎన్ని సార్లు విన్నవించినాపట్టించుకోలేదు.
ప్రస్తుతం మంత్రి సత్యకుమార్‌యాదవ్, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి పరిటాల శ్రీరామ్ దృష్టికి రైతులు ఈ సమస్యను తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు ఎక్స్‌కవేటర్ సాయంతో కెనాల్‌లో 10 కిలోమీటర్ల వరకు ముళ్లకంపలను, పూడికను తొలగించారు. అదే విధంగా పోతుకుంట చెరువులో కూడా ముళ్లకంపలను తొలగించారు. దీంతో ఆయా గ్రామాల రైతులు పరిటాల శ్రీరామ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.