భక్తిశ్రద్ధలతో రౌద్రాల అంకాళమ్మ జాతర
ABN , Publish Date - Jun 04 , 2024 | 11:42 PM
పీలేరు గ్రామ దేవత అయిన రౌద్రాల అంకాళమ్మ జాతర మంగళవారం అత్యంత భక్తిశ్ర ద్ధలతో జరిగింది.
పీలేరు టౌన, జూన 4: పీలేరు గ్రామ దేవత అయిన రౌద్రాల అంకాళమ్మ జాతర మంగళవారం అత్యంత భక్తిశ్ర ద్ధలతో జరిగింది. ఐదు వారాల జాతరలో భాగంగా మంగళవారం రెండో వారం కావడంతో స్థానికులు పెద్దఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నా రు. జాతర సందర్భంగా మంగళవారం ఉదయాత్పూర్వమే అమ్మవారిని అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు. జాతర సంద ర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు నాగయ్య, వెంకటరమణ, చంద్ర, తదితరులు పాల్గొన్నారు.