Share News

Modi Cabinet Ministers: ఏపీకి దక్కిన కేంద్ర మంత్రి పదవులు ఇవే

ABN , Publish Date - Jun 10 , 2024 | 08:07 PM

కేంద్ర కేబినెట్‌లో తెలుగు మంత్రులకు కీలక మంత్రిత్వ శాఖలు దక్కాయి.

Modi Cabinet Ministers: ఏపీకి దక్కిన కేంద్ర మంత్రి పదవులు ఇవే

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌లో తెలుగు మంత్రులకు కీలక మంత్రిత్వ శాఖలు దక్కాయి. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుకి కేంద్ర పౌరవిమానయాన శాఖ, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణాభివృద్ధి శాఖ, కమ్యూనికేషన్ సహాయ మంత్రి, నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి పదవులు దక్కాయి.


ఇక తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ మంత్రిగా, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ప్రధాని నరేంద్ర మోదీ అవకాశం ఇచ్చారు.

Updated Date - Jun 10 , 2024 | 08:11 PM