రామాయణం మానవీయ విలువలకు దర్పణం
ABN , Publish Date - Mar 12 , 2024 | 11:38 PM
శ్రీమద్ రామాయణం మానవీయ విలువలకు ప్రతీకగా నిలుస్తుందని తిరుమల తిరుపతి దేవస్థాన హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి జిల్లా శాఖ కార్య నిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు.
పెద్దకడుబూరు, మార్చి 12: శ్రీమద్ రామాయణం మానవీయ విలువలకు ప్రతీకగా నిలుస్తుందని తిరుమల తిరుపతి దేవస్థాన హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి జిల్లా శాఖ కార్య నిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని హెచ్ మురవణి గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రారంభమైన టీడీపీ ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజూ స్థానిక భజన మండలిచే భజనలు, బ్రహ్మచారి జయదేవానంద స్వామిచే మూడు రోజుల పాటు శ్రీమద్ రామాయణం, మహాభారతం, భగవద్గీతల పై ధార్మిక ప్రవచనాలు, శుక్రవారం గోపూజ, కుంకుమార్చన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భజన మండలి అధ్యక్షులు నంబి నరసింహమూర్తి, యూ గోవిందు, వీ శ్రీశైలాచారి, ఎం ఈరన్న, కే కృష్ణ, భూమిక, మనుమంతు, వీరేష్, జే భూషణ్, బీ గోవిందు, మల్లేష్, చాకలి కృష్ణప్ప పాల్గొన్నారు.