Share News

రమణీయం రథోత్సవం

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:06 AM

నంద్యాల భగవత్‌ సేవా సమాజ్‌ కమిటి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం సంజీవనగర్‌ కోదండరామాలయం నుంచి కనులపండువగా శ్రీదేవిభూదేవి సమేత వెంకటేశ్వరస్వామివారి విష్ణుభాగ్య రథోత్సవం నిర్వహించారు.

రమణీయం రథోత్సవం
రథోత్సవంలో భగవత్‌ సేవాసమజ్‌ కమిటి సభ్యులు

నంద్యాల (కల్చరల్‌), జనవరి 16: నంద్యాల భగవత్‌ సేవా సమాజ్‌ కమిటి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం సంజీవనగర్‌ కోదండరామాలయం నుంచి కనులపండువగా శ్రీదేవిభూదేవి సమేత వెంకటేశ్వరస్వామివారి విష్ణుభాగ్య రథోత్సవం నిర్వహించారు. ఈ రధోత్సవ శోభాయాత్రలో డప్పులు, మేలతాళాలతో, భజనలు, మహిళలలచే కోలాటప్రదర్శన,చెక్క భజనలు, హరిదాసు సంకీర్తనలు చేసుకుంటూ ఉత్సవమూర్తులకు అంగరంగ వైభవంగా రోధోత్సవం నిర్వహించారు. ఈ శోభాయాత్ర చందనబ్రదర్స్‌ ఆర్చ్‌, రామక్రిష్ణ డిగ్రీకాలేజి ఆర్చ్‌, శ్రీనిధిసెంటర్‌, శ్రీనివాససెంటర్‌, ప్రతాప్‌ధియోటర్‌, సాయిబాబాఆలయం మీదుగా కల్పనసెంటర్‌ నుంచి గాందిచౌక్‌ తిరిగి సంజీవనగర్‌ రామాలయం చేరుకుంది. స్వామి వారకి లోక కళ్యాణార్థం ప్రత్యేక అలంకరణతో ఏర్పాటుచేసిన ఈ విష్ణుభాగ్య రధోత్సవంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులు ఆసీనమయ్యారు.

వైభవగా సోమనందీశ్వరస్వామి కల్యాణం : నంద్యాల ఆత్మకూరు బస్టాండు సమీపంలోని సోమనందీశ్వరాలయంలో ఆలయశాశ్వత ధర్మకర్త బిల్లుపాటి వెంకట శంకరయ్య, అర్చకుల ఆధ్వర్యంలో మంగళవారం స్వామి అమ్మవార్ల కల్యాణం నిర్వహించారు.

Updated Date - Jan 17 , 2024 | 12:06 AM