Share News

ఉత్తర కోస్తాలో వర్షాలు

ABN , Publish Date - Mar 16 , 2024 | 02:17 AM

ఉత్తర ఒడిశా నుంచి దక్షిణ ఛత్తీ్‌సగఢ్‌ వరకు, మరఠ్వాడ నుంచి కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమెరిన్‌ తీరం వరకు వేర్వేరుగా ద్రోణులు విస్తరించాయి. ఇంకా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అధిక పీడనం కొనసాగుతోంది.

ఉత్తర కోస్తాలో వర్షాలు

విశాఖపట్నం, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ఉత్తర ఒడిశా నుంచి దక్షిణ ఛత్తీ్‌సగఢ్‌ వరకు, మరఠ్వాడ నుంచి కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమెరిన్‌ తీరం వరకు వేర్వేరుగా ద్రోణులు విస్తరించాయి. ఇంకా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అధిక పీడనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో శుక్రవారం ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఇదే సమయంలో రాయలసీమలో ఎండతీవ్రత కొనసాగింది. దేశంలో అత్యధికంగా అనంతపురంలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో ఉత్తరకోస్తాలో పలుచోట్ల ఉరుములతో వర్షాలు కురుస్తాయని, దక్షిణ కోస్తా, రాయలసీమలో పొడి వాతావరణం నెలకొంటుందని, రాయలసీమలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - Mar 16 , 2024 | 08:34 AM