Share News

rains వర్షానికి దెబ్బతిన్న పంటలు

ABN , Publish Date - Aug 21 , 2024 | 11:57 PM

వర్షాలకు సాగుచేసిన పంటలు దెబ్బతినడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఏలుకుంట్ల గ్రామంలో రైతు పెద్దకేశవయ్య ఎకరాలో సాగుచేసిన మిరప, రైతు చంద్రశేఖర్‌ ఎకరాలో సాగుచేసిన టమోటా పంటలు నీటమునిగాయి.

rains వర్షానికి దెబ్బతిన్న పంటలు
మిర్చిపంటను చూపుతున్న రైతు పెద్దకేశవయ్య

నీట మునిగిన టమోటా, మిరప పంటలు

ఆవేదనలో రైతులు

ధర్మవరంరూరల్‌, ఆగస్టు 21: వర్షాలకు సాగుచేసిన పంటలు దెబ్బతినడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఏలుకుంట్ల గ్రామంలో రైతు పెద్దకేశవయ్య ఎకరాలో సాగుచేసిన మిరప, రైతు చంద్రశేఖర్‌ ఎకరాలో సాగుచేసిన టమోటా పంటలు నీటమునిగాయి. అంతేకాకుండా పలువురు రైతులు సాగుచేసిన వేరుశనగ, మొక్కజొన్న దెబ్బతిన్నాయి. మిరప, టమోటా కోతకు వచ్చిన దశలో వర్షం రావడంతో పూర్తిగా నష్టపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. హార్టికల్చర్‌ అధికారి గీతాంజలి పంటలను పరిశీలించారు. పంటనష్టంపై ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తామని తెలిపారు.

Updated Date - Aug 21 , 2024 | 11:57 PM