Share News

RAIN : రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు

ABN , Publish Date - Jun 03 , 2024 | 12:05 AM

మండలంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు, పొంగి పొర్లాయి. పట్టణంలోని ప్రధాన రోడ్లపై వర్షపునీరు ప్రవహించింది. దీంతో దిగువ ప్రాంతాల్లోని రహదారు ల్లో నీరు నిలువడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. పెనుకొండ-మడకశిర రహదారి నుంచి నారాయణమ్మ కాలనీ మీదుగా కోనాపురం, మంగాపురం, డిగ్రీ కళాశాలకు వెళ్లే దారిలో వర్షపునీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

RAIN : రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు
Narayanamma Colony Road people are suffering

పెనుకొండ రూరల్‌, జూన 2 : మండలంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు, పొంగి పొర్లాయి. పట్టణంలోని ప్రధాన రోడ్లపై వర్షపునీరు ప్రవహించింది. దీంతో దిగువ ప్రాంతాల్లోని రహదారు ల్లో నీరు నిలువడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. పెనుకొండ-మడకశిర రహదారి నుంచి నారాయణమ్మ కాలనీ మీదుగా కోనాపురం, మంగాపురం, డిగ్రీ కళాశాలకు వెళ్లే దారిలో వర్షపునీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నారాయణమ్మ కాలనీ రోడ్డుకు మరమ్మతులు చేయాలని వైసీపీ హయాంలో ఐదేళ్ల నుంచి మునిసిపల్‌ అధికారులకు, పాలకులకు విన్నవించినా నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజలు వాపోయారు. ఇప్పటికైనా రానున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని నారాయణమ్మ కాలనీలో గుంతలమయంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరారు. పెనుకొండ డివిజనలో 43మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 03 , 2024 | 12:05 AM