Share News

డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ కృష్ణరాజు

ABN , Publish Date - Nov 13 , 2024 | 05:35 AM

మాజీ ఎంపీ, ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు శాసనసభ ఉప సభాపతి హోదాలో ‘అధ్యక్షా...’ అని పిలిపించుకోనున్నారు.

డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ కృష్ణరాజు

పేరు ఖరారు చేసిన చంద్రబాబు

ఎన్నిక లాంఛనప్రాయమే

అమరావతి, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ, ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు శాసనసభ ఉప సభాపతి హోదాలో ‘అధ్యక్షా...’ అని పిలిపించుకోనున్నారు. టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ పేరును ఖరారు చేశారు. అసెంబ్లీలో ఈ ఎన్నిక ప్రక్రియ జరగాల్సి ఉంది. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడం, ఆ పార్టీ సభ్యులు సభకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో... ఉప సభాపతిగా రఘురామ ఎన్నికలాంఛనప్రాయమే కానుంది. పారిశ్రామిక వేత్త అయిన రఘురామకృష్ణ రాజు కొంతకాలం బీజేపీలో ఉన్నారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి... నరసాపురం ఎంపీ అయ్యారు. అతి కొద్దికాలానికే జగన్‌ వైఖరితో విసిగి వేసారి పోయారు. ‘వైసీపీ రెబల్‌ ఎంపీ’గా నిత్యం జగన్‌పై ఢిల్లీ వేదికగా ప్రెస్‌మీట్లతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే రఘురామను సీఐడీ అరెస్టు చేయడం, కస్టడీలో తీవ్రంగా హింసించడం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. గత ఎన్నికల ముందు రఘురామ టీడీపీలో చేరారు. ఆయనను తిరిగి లోక్‌సభకు పంపించాలని భావించినా... కూటమిలో సమీకరణలు, సీట్ల సర్దుబాటులో అది కుదరలేదు. దీంతో... రఘురామను ఉండి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా బరిలో నిలబెట్టారు. కూటమి ఘన విజయం అనంతరం ఆయనకు సముచిత గౌరవం లభిస్తుందని అంతా భావిస్తూ వచ్చారు. ఇప్పుడు ఉప సభాపతి పదవికి ఎంపిక చేశారు.

Updated Date - Nov 13 , 2024 | 05:35 AM