రాచమల్లు పైశాచికత్వం తగదు
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:50 PM
అరాచకమల్లు అని ఆంధ్రజ్యోతిలోవచ్చిన కఽథనాన్ని జీర్ణించుకోలేక నాలుగేళ్ల బాలుడిపట్ల పైశాచికత్వంతో ప్రవర్తించిన ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని టీడీపీ నేత సీఎం సురేశ్‌నాయుడు డిమాండ్ చేశారు.

పత్రికల్లో వార్తలకే ఉలికిపాటెందుకు
ఓటమి భయంతో నీచానికి దిగజారుతున్నావు
బాలుడి పట్ల అసభ్య ప్రవర్తనపై కేసు నమోదు చేయాలి
టీడీపీ నేతల డిమాండ్
ప్రొద్దుటూరు, మార్చి 6: అరాచకమల్లు అని ఆంధ్రజ్యోతిలోవచ్చిన కఽథనాన్ని జీర్ణించుకోలేక నాలుగేళ్ల బాలుడిపట్ల పైశాచికత్వంతో ప్రవర్తించిన ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని టీడీపీ నేత సీఎం సురేశ్‌నాయుడు డిమాండ్ చేశారు. బహిరంగంగాబాలుడి హక్కులను కాలరాసిన ఎమ్మెల్యేతో పాటు వైసీపీ కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
బుధవారం స్థానిక అన్నా క్యాంటీన్‌లోని టీడీపీ కార్యాలయంలో సురేశ్‌నాయుడు మాట్లాడుతూ.. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన ప్రతి విషయం వాస్తమన్నారు. పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తికి పత్రికలు, ప్రతిపక్షాల ఆరోపణలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎలా ఎదుర్కోవాలో చేతకాకపోవడం ప్రొద్దుటూరు ప్రజల దౌర్భాగ్యమన్నారు. మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రజ్యోతిని గురించి మాట్లాడే ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి.. చంద్రబాబు లోకేశ్‌పై సాక్షిలో రాసే రాతలకు ఆపత్రికను దేనికి తుడవాలో కూడా చెప్పాలన్నారు. ము.. తుడుచుకోవడానికి పనికిరాదని చెప్పే పేపర్లో వార్తలోస్తే ఉలికిపాటెందుకు పడుతున్నారో రాచమల్లు సమాధానం చెప్పాలన్నారు. పత్రికలను వాటి అధినేతలను పాత్రికేయులను దూషించటం పిరికిపంద చర్య అన్నారు.
మాజీ మున్సిపల్ ఇన్‌చార్జ్ చైర్మన్ వీఎ్‌స ముక్తియార్ మాట్లాడుతూ రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు ప్రతివిమర్శలు ఆరోపణలు సహజం అన్నారు. రాచమల్లు తనపై పత్రికలు ప్రతిపక్షాలు చేసే విమర్శలను కూడా జీర్జించుకోలేక నీచమైన పద్ధతులకు దిగడం తగదన్నారు. బాలుడిపట్ల ప్రవర్తించిన తీరుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆమేరకు కలెక్టర్‌కు, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ న్యాయవాది ఈవీ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రాచమల్లు చదువుకున్న విద్యావంతుడైన మూర్ఖుడన్నారు. ఓటమి భయంతో ఫ్రస్ర్టేషన్‌లో ఎంతవరకైనా దిగజారి ప్రవర్తించటం దారుణమన్నారు. బాలుడిపై ప్రవర్తించిన తీరుకు ఎమ్మెల్యేపై మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేయాలన్నారు. జనసేన నియోజకవర్గ ప్రతినిధి జిలాన్ మాట్లాడుతూ బాలుడిపట్ల ఎమ్మెల్యే రాచమల్లు చర్యలు హేయమైనవని జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. పిల్లవాడి ఏడుపును చూసి రాక్షసానందం పొందిన వైసీపీ కార్యకర్తలు మానసిక వైకల్యం చెందారన్నారు.సమావేశంలో టీడీపీ మాజీ ఎంపీపీ శెట్టి ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ యువత అధికార ప్రతినిధి నల్లబోతు నాగరాజు, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.
రాచమల్లుపై హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు స్వీకరణ
- 3649/ఇన్/2024 నెంబరుగా కేసు డైరీలో నమోదు
ప్రొద్దుటూరు, మార్చి 6: ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి మంగళవారం ఒక బాలుడు ఏడుస్తున్నా బట్ట లూడదీయాలంటూ తన అనుచరులను ఉసిగొల్పడం, పేపర్‌తో బాలుడి ము.. తుడవమని, గు.. తుడవమని అసభ్యంగా ప్రవర్తించటంపై హ్యూమన్‌రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర సహాయకార్యదర్శి కరుణాకర్ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌బుధవారం 3649 /ఇన్/2024గా కేసు డైరీలో ఫిర్యాదు నమోదు అయింది. ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ పత్రికలో వచ్చిన ఆరోపణలను ఖండించే స్వేచ్ఛ ఎమ్మెల్యేకు ఉందన్నారు. అంతేకాని పత్రికాస్వేచ్ఛనుహరించేలా జుగుప్సాకరంగా ఆయన కక్షపూరిత వ్యవహారం ప్రదర్శించడం కోసం బాలుడిని బహిరంగ ప్రదేశంలో బట్టలూడదీసి అసభ్యంగా మాట్లాడటం వారి హక్కులను హననం చేయడమేనన్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆ సంఘటనలో పాల్గొన్న వైసీపీ కార్యకర్తలు కూడా చర్యలకు బాధ్యులే అన్నారు. ఈ అమానవీయ ఘటనను వీడియోలో చిత్రీకరించి యూట్యూబ్ చానల్స్‌లో ప్రసారం చేయడంపై కూడా మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని. త్వరలో వీరిపై హెచ్‌ఆర్‌సీ విచారణ జరిపి చర్యలు తీసుకుంటుందన్నారు.