Share News

విలువల విద్యతోనే ఆదర్శ జీవితం

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:48 PM

విలువల విద్యతోనే ఆదర్శ జీవితం సాధ్యమనీ, అందుకు సత్యసాయి విద్యాసంస్థలు నిరంతరం కృషి చేస్తున్నాయని సత్యసాయి సెంట్రల్‌ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ పేర్కొన్నారు. స్థానిక ప్రశాంతినిలయంలోని సాయిహీరా గ్లోబల్‌ కన్వెన్షన సెంటర్‌లో సత్యసాయి విద్యావాహిని ఆధ్వర్యంలో జాతీయ విద్యాసదుస్సును జ్యోతి ప్రజ్వలన చేసి, రత్నాకర్‌ ప్రారంభించారు.

విలువల విద్యతోనే ఆదర్శ జీవితం
జ్యోతి వెలిగిస్తున్న ఆర్‌జే రత్నాకర్‌

ఆర్‌జే రత్నాకర్‌

పుట్టపర్తి, జూలై 5: విలువల విద్యతోనే ఆదర్శ జీవితం సాధ్యమనీ, అందుకు సత్యసాయి విద్యాసంస్థలు నిరంతరం కృషి చేస్తున్నాయని సత్యసాయి సెంట్రల్‌ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్‌ పేర్కొన్నారు. స్థానిక ప్రశాంతినిలయంలోని సాయిహీరా గ్లోబల్‌ కన్వెన్షన సెంటర్‌లో సత్యసాయి విద్యావాహిని ఆధ్వర్యంలో జాతీయ విద్యాసదుస్సును జ్యోతి ప్రజ్వలన చేసి, రత్నాకర్‌ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మానవ జీవితానికి మూలాధారం పంచసూత్రాలైన సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అన్నారు. వాటిని పాటించడం ద్వారానే శాంతి స్థాపన సాధ్యమన్నారు. ప్రస్తుతం సాంకేతికతతోపాటు స్వార్థం కూడా పెరిగిందనీ, అది అశాంతికి కారణమవుతోందన్నారు. 2010లో సత్యసాయి విద్యావాహిని ప్రాజెక్టును ప్రారంభించామన్నారు. సత్యసాయి సేవాసంస్థల ప్రదినిధులు విద్యావాహిని ద్వారా విలువలతో కూడిన విద్యను ప్రపంచ వ్యాప్తంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం సత్యసాయి యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ రాఘవేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. సత్యసాయి విద్యావిధానం ఆధునిక గురుకులమని అభివర్ణించారు. మూడురోజులపాటు సదస్సు కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో సత్యసాయి గ్లోబల్‌ట్రస్టు చైర్మన చక్రవర్తి, సభ్యులు నాగానందం, విద్యావాహిని డైరెక్టర్‌ కరుణామున్షి, వలంటీర్లు, శిక్షకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 11:48 PM