Share News

సమయపాలన లేక.. సేవలందక

ABN , Publish Date - Jan 05 , 2024 | 12:27 AM

రూరల్‌ మండలంలోని సింగుపురం పీహెచ్‌సీలో వైద్యులు సమ య పాలనపాటించకపోవడం తో సేవలందని పరిస్థితి నెల కొందని పలువురు రోగులు వా పోతున్నారు. ఇక్కడ ఏఎన్‌ ఎమ్‌లు, ఆశావర్కర్లతో వైద్య సేవలు కొనసాగిస్తుండడంతో రోగులు పీహెచ్‌సీకి వచ్చేం దుకు వెనుకగుడువేస్తున్నారు. దీంతో గతంతో పోలిస్తే పీహెచ్‌సీలో ప్రసవాలు, రక్త, వ్యాధి నిర్ధారణ పరీక్షలు సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. 15 సచివా లయాల పరిధిలో వైద్య సేవలకు సింగుపురం పీహెచ్‌సీపై రోగులు ఆధారపడు తున్నారు.అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో వైద్యాధికారుల నుంచి సిబ్బంది వరకు హాజరుపట్టికలో సంతకాలు చేయడం, ఆన్‌లైన్‌ థంబింగ్‌ చేయడానికే పరిమిత మవుతున్నారని పలువురు రోగులు ఆరోపిస్తున్నారు. ఈనేపథ్యంలో గురువారం సిం గుపురంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పర్యటించిన సమయంలో కూడా వైద్యులు పీహెచ్‌సీకి గైర్హాజరయ్యారు. కాగా పీహెచ్‌సీలో మలేరియా పరీక్షలు నిర్వ హణను పొందుపరిచే రికార్డుల్లో ఈనెల 3వతేదీ పరీక్షలను 4వ తేదీన నిర్వహి స్తున్నట్లు రోజువారీ పరీక్షల తేదీలను మార్చడం విశేషం. వైద్యపరీక్షలు చేసిన సిరంజీలు, వాడని సిరంజీలను కలిపేస్తూ ఒకేచోట ఉంచి ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని రోగులుఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇక్కడ ఒక్క రోగి కూడా లేకపోవడంతో బెడ్లు ఖాళీగా దర్శనమిచ్చాయి.

  సమయపాలన లేక.. సేవలందక

శ్రీకాకుళం క్రైం: రూరల్‌ మండలంలోని సింగుపురం పీహెచ్‌సీలో వైద్యులు సమ య పాలనపాటించకపోవడం తో సేవలందని పరిస్థితి నెల కొందని పలువురు రోగులు వా పోతున్నారు. ఇక్కడ ఏఎన్‌ ఎమ్‌లు, ఆశావర్కర్లతో వైద్య సేవలు కొనసాగిస్తుండడంతో రోగులు పీహెచ్‌సీకి వచ్చేం దుకు వెనుకగుడువేస్తున్నారు. దీంతో గతంతో పోలిస్తే పీహెచ్‌సీలో ప్రసవాలు, రక్త, వ్యాధి నిర్ధారణ పరీక్షలు సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. 15 సచివా లయాల పరిధిలో వైద్య సేవలకు సింగుపురం పీహెచ్‌సీపై రోగులు ఆధారపడు తున్నారు.అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో వైద్యాధికారుల నుంచి సిబ్బంది వరకు హాజరుపట్టికలో సంతకాలు చేయడం, ఆన్‌లైన్‌ థంబింగ్‌ చేయడానికే పరిమిత మవుతున్నారని పలువురు రోగులు ఆరోపిస్తున్నారు. ఈనేపథ్యంలో గురువారం సిం గుపురంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పర్యటించిన సమయంలో కూడా వైద్యులు పీహెచ్‌సీకి గైర్హాజరయ్యారు. కాగా పీహెచ్‌సీలో మలేరియా పరీక్షలు నిర్వ హణను పొందుపరిచే రికార్డుల్లో ఈనెల 3వతేదీ పరీక్షలను 4వ తేదీన నిర్వహి స్తున్నట్లు రోజువారీ పరీక్షల తేదీలను మార్చడం విశేషం. వైద్యపరీక్షలు చేసిన సిరంజీలు, వాడని సిరంజీలను కలిపేస్తూ ఒకేచోట ఉంచి ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని రోగులుఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇక్కడ ఒక్క రోగి కూడా లేకపోవడంతో బెడ్లు ఖాళీగా దర్శనమిచ్చాయి.

విచారించి శాఖాపరమైన చర్యలు

సింగుపురం పీహెచ్‌పీలో వైద్యుల గైర్హాజరు, సమయపాలన పాటించని విషయం దృష్టికి రాలేదని డీఎంహెచ్‌వో బి.మీనాక్షి ఆంధ్రజ్యోతికి తెలిపారు. తక్షణమే విచారించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలకు వైద్య సేవలందిచడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించమని తెలిపారు.

Updated Date - Jan 05 , 2024 | 12:27 AM