Share News

మున్సిపల్‌ టీచర్ల పదోన్నతులకు షెడ్యూలు

ABN , Publish Date - Oct 29 , 2024 | 03:34 AM

మున్సిపల్‌ టీచర్లకు పదోన్నతులు కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

మున్సిపల్‌ టీచర్ల పదోన్నతులకు షెడ్యూలు

నవంబరు 8లోగా ప్రక్రియ పూర్తి

అమరావతి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ టీచర్లకు పదోన్నతులు కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇటీవల ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం రావడంతో ఆ శాఖ డైరెక్టర్‌ వి.విజయరామరాజు పదోన్నతుల ప్రక్రియకు సోమవారం షెడ్యూలు విడుదల చేశారు. ఎస్జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి గ్రేడ్‌-2 హెచ్‌ఎం పోస్టులకు పదోన్నతులు కల్పించనున్నట్లు తెలిపారు.

అభ్యంతరాలకు గడువు పెంచాలి

సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాలు తెలిపే గడువు 15 రోజులకు పెంచాలని పెంచాలని మున్సిపల్‌ టీచర్ల సమాఖ్య అధ్యక్షుడు రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించడంపై ఏపీటీఎఫ్‌-1938 అధ్యక్షుడు జి.హృదయరాజు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Oct 29 , 2024 | 03:34 AM