Share News

ప్రజా సహకారంతోనే డెంగ్యూ నివారణ

ABN , Publish Date - May 16 , 2024 | 11:24 PM

ప్రజా సహకారంతోనే డెంగ్యూ నివారణ సాధ్యమని వాల్మీకిపురం

ప్రజా సహకారంతోనే డెంగ్యూ నివారణ
కలకడ పాపిరెడ్డిగారిపల్లెలో ర్యాలీ నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది

వాల్మీకిపురం, మే 16: ప్రజా సహకారంతోనే డెంగ్యూ నివారణ సాధ్యమని వాల్మీకిపురం మండల చింతపర్తి పీహెచసీ వైద్య ఆరోగ్యశాఖ అఽధికారులు పేర్కొన్నారు. జాతీయ డెంగ్యూ నివా రణ దినోత్సవం సందర్భంగా పీహెచసీ సిబ్బందితో ర్యాలీ నిర్వ హించి సచివాలయంలో అవగాహన సమావేశాలు నిర్వహిం చారు. ఈసందర్భంగా వైద్యాధికారులు మాట్లాడుతూ పరిసరాల లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని ఇంటిలోని కిటికీలకు మెస్‌ ఏర్పాటు చేసుకోవడం వల్ల దోమ కాటు నుంచి రక్షణ పొందవచ్చన్నారు. వారానికి ఒకసారి డ్రై డేగా పాటించి వాడ కంలో ఉన్న నీటిని నిలువ ఉంచుకున్న పాత్రలు పంపులలోని నీటిని తొలగించి ఆరబెట్టి తిరిగి నీటిని నింపుకుని వాడు కోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో హెల్త్‌ ఎడ్యుకేటర్‌ మహ్మద్‌ రఫీ,మలేరియా సబ్‌యూనిట్‌ అధికారి ముజీబ్‌, ఆరోగ్య పర్యవేక్షకులు సుధాకర్‌, ఎల్‌టీ సురేష్‌, ఏఎనఎంలు, ఆశా కార్య కర్తలు పాల్గొన్నారు.

కలకడలో:జాతీయ డెం గ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపల్లె ఆసుపత్రి వైద్యులు జవహ ర్‌బాబుతో కలిసి పాపిరెడ్డి గారిపల్లెలో ర్యాలీ నిర్వహిం చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జూన నెల నుంచి జనవరి వరకు దోమ లార్వా ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందన్నారు. గ్రామాలోని ప్రజలు ఇళ్ల వద్ద మురుగు నీరు నిల్వ లేకుండా శ్రుభంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే దోమ నివారణకు తీసుకోవాల్సి జాగ్రత్తల ను తెలిపారు. కార్యక్రమం లో సిబ్బంది పాల్గొన్నారు.

ములకలచెరువులో: ము లకలచెరువులో గురువారం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవ ర్యాలీ నిర్వహించా రు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది స్ధానిక ప్రభుత్వా స్పత్రి నుంచి పురవీధుల్లో ప్రదర్శన చేపట్టారు. వైద్యాధికారిణిలు జాహ్నవిరెడ్డి, రేష్మాలు మాట్లాడుతూ డెంగ్యూ నివారణకు ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని సహకరించాల న్నారు. కార్యక్రమాల్లో వైద్య సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2024 | 11:24 PM