Share News

చెరువు ఆక్రమణను అడ్డుకోండి

ABN , Publish Date - Feb 29 , 2024 | 03:39 AM

శ్రీకాకుళంజిల్లా, సింగుపురం గ్రామపంచాయతీ పరిధిలోని చెరువును స్థానిక సర్పంచ్‌ ఆక్రమించారని ఆరోపిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు

చెరువు ఆక్రమణను అడ్డుకోండి

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశం

అమరావతి, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంజిల్లా, సింగుపురం గ్రామపంచాయతీ పరిధిలోని చెరువును స్థానిక సర్పంచ్‌ ఆక్రమించారని ఆరోపిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. చెరువులో ఆక్రమణలు తొలగించి, దాని రక్షణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. అనంతం నివేదికను కోర్టు ముందు ఉంచాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. శ్రీకాకుళంజిల్లా, సింగుపురం గ్రామపంచాయతీ పరిధిలోని చెరువును స్థానిక సర్పంచ్‌ ఆదిత్యనాయుడు ఆక్రమించారని పేర్కొంటూ ఎంపీటీసీ అప్పారావు మరో ఐదుగురు హైకోర్టులో పిల్‌ వేశారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది విద్యావతి వాదనలు వినిపించారు. ఆక్రమణలకు సంబంధించి ఫోటోలను కోర్టు ముందు ఉంచారు.

Updated Date - Feb 29 , 2024 | 09:01 AM