Share News

కన్నుల పండువగా ప్రభల తీర్థం

ABN , Publish Date - Jan 17 , 2024 | 02:44 AM

సంక్రాంతి ఉత్సవాల్లో మూడో రోజు కనుమ సందర్భంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జి ల్లాలో ప్రభల తీర్థాలు మంగళవారం వైభవంగా జరిగాయి.

కన్నుల పండువగా ప్రభల తీర్థం

అంబాజీపేట, జనవరి 16: సంక్రాంతి ఉత్సవాల్లో మూడో రోజు కనుమ సందర్భంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జి ల్లాలో ప్రభల తీర్థాలు మంగళవారం వైభవంగా జరిగాయి. అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో జరిగిన ప్రభల తీర్థానికి సుమారు రెండు లక్షల మంది ప్రజలు తరలివచ్చారు. అంబాజీపేట, అయినవిల్లి, అమలాపురం మం డలాల 11 గ్రామాల నుంచి ఏకాదశ రుద్రులతో పాటు వివిధ రూపాలతో తీసుకువచ్చిన ప్రభలు జగ్గన్నతోటలో కొలువుతీరాయి. ఏకాదశ రుద్రుల శకటం గత ఏడాది దేశ రాజఽధాని ఢిల్లీ పెరేడ్‌లో ప్రదర్శించడంతో జగ్గన్నతోట ప్రభల ఉత్సవం ఖ్యాతి ప్రపంచ నలుమూలల విస్తరించింది. దీంతో దేశ, విదేశాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు ఏకాదశ రు ద్రుల ప్రభలను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రభలను విశేషాలంకరణలతో ముస్తాబుచేశారు.

Updated Date - Jan 17 , 2024 | 02:44 AM