Share News

కేఆర్‌ఎంబీ పరిధిలోకి విద్యుత్‌ కేంద్రాలు

ABN , Publish Date - Aug 21 , 2024 | 05:45 AM

తెలుగు రాష్ట్రాలలోని విద్యుత్‌ కేంద్రాలను కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు పరిధిలోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌

కేఆర్‌ఎంబీ పరిధిలోకి విద్యుత్‌ కేంద్రాలు

ఏపీ పిటిషన్‌పై సుప్రీం విచారణ వాయిదా

న్యూఢిల్లీ, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాలలోని విద్యుత్‌ కేంద్రాలను కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు పరిధిలోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న విద్యుత్‌ కేంద్రాలను కేఆర్‌ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని కోరుతూ ఏపీ సర్కార్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ అంశానికి సంబంధించి నోటిఫికేషన్‌ ఇచ్చామని, అఫిడవిట్‌ దాఖలు చేశామని కేంద్రం తరఫు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి కోర్టుకు తెలిపారు. విచారణను సెప్టెంబరు 9కి వాయిదా వేసింది.

Updated Date - Aug 21 , 2024 | 05:45 AM