Share News

శ్రీవారి ఆలయం ముందు ఫొటో షూట్‌

ABN , Publish Date - Nov 29 , 2024 | 05:42 AM

తిరుమలలో వైసీపీ నేతల నిబంధనల ఉల్లంఘనలు కొనసాగుతూనే ఉన్నాయి. దువ్వాడ శ్రీనివాస్‌, అంబటి రాంబాబు, నారాయణస్వామి ఇప్పటికే

శ్రీవారి ఆలయం ముందు ఫొటో షూట్‌

వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి అనుచరుడి అత్యుత్సాహం

తిరుమల, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): తిరుమలలో వైసీపీ నేతల నిబంధనల ఉల్లంఘనలు కొనసాగుతూనే ఉన్నాయి. దువ్వాడ శ్రీనివాస్‌, అంబటి రాంబాబు, నారాయణస్వామి ఇప్పటికే టీటీడీ నిబంధనలు ఉల్లంఘించి విమర్శలపాలైన విషయాన్ని మరువక ముందే వైసీపీ ఎంపీ అవినాశ్‌ రెడ్డి అనుచరుడు, కమలాపురానికి చెందిన వ్యాపారవేత్త వంశీనాథ్‌ రెడ్డి మరో వివాదానికి తెరతీశారు. తన పుట్టినరోజు సందర్భంగా గురువారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా శ్రీవారి ఆలయం ముందు నలుగురు ప్రైవేట్‌ ఫొటోగ్రాఫర్లతో ఫొటోషూట్‌ నిర్వహించి విమర్శలపాలయ్యారు. ఆలయం ముందే నిలబడి ఫొటోలు, వీడియోలు తీయించుకుంటూ హల్‌చల్‌ చేశారు. ఇంత జరుగుతున్నా విజిలెన్స్‌ అధికారులు, సిబ్బంది పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపైనా వంశీనాథ్‌రెడ్డి అనుచరులు దురుసుగా ప్రవర్తించారు. ‘మీరెందుకు ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వ్యవహారంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై టీటీడీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Updated Date - Nov 29 , 2024 | 05:42 AM