Share News

జనం విలవిల

ABN , Publish Date - Apr 25 , 2024 | 04:34 AM

భానుడి ప్రతాపంతో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 40 నుంచి 45డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

జనం విలవిల

45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

ఉత్తరకోస్తాలో తీవ్ర వడగాల్పులు

అమరావతి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): భానుడి ప్రతాపంతో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 40 నుంచి 45డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతతో పాటు వడగాడ్పులు వీస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో వడగాల్పులకు జనం విలవిలలాడుతున్నారు. ఉత్తరాంధ్రలో తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో రాత్రి పొద్దుపోయే దాకా సెగ తగ్గడం లేదు. బుధవారం విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కడప జిల్లా బలపనూరులో 44.9, ప్రకాశం జిల్లా దొనకొండలో 44.3, నంద్యాల జిల్లా మహానందిలో 44.2, అనకాపల్లి జిల్లా రావికమతంలో 44.1, ఎన్టీఆర్‌ జిల్లా కంభంపాడు, పల్నాడు జిల్లా రావిపాడులో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 105 మండలాల్లో వడగాడ్పులు వీచగా, 69 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచాయి. గురువారం శ్రీకాకుళం. విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, విశాఖ జిల్లాల్లోని 54 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని, శ్రీకాకుళం నుంచి పల్నాడు వరకు 154 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

Updated Date - Apr 25 , 2024 | 04:35 AM