Share News

పెన్షనర్లకు ఇబ్బంది కలగకూడదు

ABN , Publish Date - Apr 28 , 2024 | 03:33 AM

రాష్ట్రంలో సామాజిక పెన్షన్ల పంపిణీని, ఇతర నగదు బదిలీ పథకాలను వలంటీర్లతో కాకుండా ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పంపిణీ చేయించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) మరోసారి ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని ఆదేశించింది.

పెన్షనర్లకు ఇబ్బంది కలగకూడదు

పింఛన్లు, ఇతర పథకాలను ప్రభుత్వ ఉద్యోగులతో పంపిణీ చేయించాలి

ఏర్పాట్లు సరిగా లేవని ఫిర్యాదులొచ్చాయ్‌

నిబంధనలు పక్కాగా పాటించండి

వలంటీర్లను దూరం పెట్టాల్సిందే

సీఎ్‌సకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు

అమరావతి, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సామాజిక పెన్షన్ల పంపిణీని, ఇతర నగదు బదిలీ పథకాలను వలంటీర్లతో కాకుండా ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పంపిణీ చేయించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) మరోసారి ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని ఆదేశించింది. పింఛనుదారులకు ఇబ్బంది లేకుండా చేయాలని స్పష్టం చేసింది. ఈ అంశంపై మార్చి 30నే తాము లేఖ రాసిన విషయం గుర్తు చేసింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో వలంటీర్లు పాల్గొనకుండా కట్టడి చేయాలని తేల్చిచెప్పింది. పెన్షన్ల పంపిణీ, ఇతర నగదు బదిలీ పథకాల అమలు ఏర్పాట్లు సరిగా లేవని పలు ఫిర్యాదులొచ్చాయని తెలిపింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నికల నిబంధనలను పక్కాగా అమలు చేస్తూ తగు చర్యలు తీసుకోవాలని సీఎ్‌సకు శుక్రవారం ఇచ్చిన ఆదేశాల్లో స్పష్టం చేసింది.

Updated Date - Apr 28 , 2024 | 07:03 AM