Share News

చంద్రబాబు గెలుపుపై పెన్షనర్ల సంబరాలు

ABN , Publish Date - Jun 08 , 2024 | 03:29 AM

ఏపీలో గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం తమను ఎన్నోరకాలుగా ఇబ్బందులు పెట్టిందని, ఎంతో వేదనకు గురి చేసిందని

చంద్రబాబు గెలుపుపై పెన్షనర్ల సంబరాలు

జగన్‌ పాలనలో ఇబ్బందులు పడ్డామని వ్యాఖ్య

యూసు్‌ఫగూడ, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): ఏపీలో గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం తమను ఎన్నోరకాలుగా ఇబ్బందులు పెట్టిందని, ఎంతో వేదనకు గురి చేసిందని ‘అసోసియేషన్‌ ఫర్‌ ఏపీ పెన్సనర్స్‌ సెటిల్డ్‌ ఎట్‌ హైదరాబాద్‌’ నాయకులు బి.లక్ష్మీకాంతం, నళినీ మోహన్‌కుమార్‌, టీఎంబీ బుచ్చిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే చంద్రబాబు నాయుడు గెలుపునకు తమవంతు కృషి చేశామని, ఎట్టకేలకు అనూహ్య విజయంతో చంద్రబాబు అధికారంలోకి రావటం తమకు ఎంతో ఆనందం కలిగించిందని అన్నారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతున్న సందర్భంగా శుక్రవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో వారు కేక్‌కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. ఐదేళ్ల జగన్‌ పాలనలో ఎన్నో ఇబ్బందులు పెట్టారని, రివర్స్‌ పీఆర్సీ, పెన్షన్ల కోత, వేతన సవరణ, కరువు భత్యాల బాకీలు ఇవ్వకుండా అవస్థలు పెట్టారన్నారు.

Updated Date - Jun 08 , 2024 | 07:50 AM