Share News

ఇంటి వద్దకే పింఛన్‌: మంత్రి సవిత

ABN , Publish Date - Jun 27 , 2024 | 02:02 AM

టీడీపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టో హామీ మేరకు వచ్చే నెల ఒకటో తేదీన ఇంటి వద్దనే పింఛన్లు అందజేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు.

ఇంటి వద్దకే పింఛన్‌: మంత్రి సవిత

పెనుకొండ టౌన్‌, జూన్‌ 26: టీడీపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టో హామీ మేరకు వచ్చే నెల ఒకటో తేదీన ఇంటి వద్దనే పింఛన్లు అందజేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్‌దారులను జగన్‌ మోసగించారని, అధికారంలోకి వస్తే పింఛన్‌ రూ.3 వేలు ఇస్తామని హామీ ఇచ్చి.. నిలబెట్టుకోలేదని విమర్శించారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో రూ.50 లక్షలతో కొనుగోలు చేసిన కాంపాక్ట్‌ వాహనాన్ని ఆమె బుధవారం స్వయంగా నడిపి ప్రారంభించారు. సీఎం చంద్రబాబు హామీ మేరకు పెంచిన పింఛన్‌ రూ.4 వేలు, మూడు నెలలకు సంబంధించి రూ.వెయ్యి చొప్పున... కలిపి మొత్తం రూ.7,000 పింఛన్‌దారులకు అందజేస్తామని మంత్రి అన్నారు.

Updated Date - Jun 27 , 2024 | 07:35 AM