పవన్ గెలవాలి
ABN , Publish Date - May 12 , 2024 | 03:42 AM
పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో విజయం సాధించాలని సినీనటుడు, రామ్‌చరణ్, ఆయన తల్లి సురేఖ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆకాంక్షించారు.

రామ్‌చరణ్, సురేఖ, అల్లు అరవింద్ ఆకాంక్ష
పిఠాపురం, మే 11: పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో విజయం సాధించాలని సినీనటుడు, రామ్‌చరణ్, ఆయన తల్లి సురేఖ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆకాంక్షించారు. శనివారం కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని పవన్ కల్యాణ్ నివాసానికి వారంతా విచ్చేశారు. బాబాయ్‌తో రామ్‌చరణ్ భేటీ అయ్యారు. ఇద్దరూ బయటకు వచ్చి భారీగా తరలివచ్చిన అభిమానులు, జనసైనికులకు అభివాదం చేశారు. అనంతరం పవన్‌తో రామ్‌చరణ్, సురేఖ, అరవింద్ సమావేశమయ్యారు. పవన్ విజయం సాధించాలని ఆకాంక్షించారు. పవన్‌కు సురేఖ ఆశీస్సులు అందించారు. అంతకుముందు పిఠాపురం పట్టణంలోని పాదగయ క్షేత్రాన్ని రామ్‌చరణ్, సురేఖ, అల్లు అరవింద్ దర్శించుకుని పూజలు నిర్వహించారు. రామ్‌చరణ్‌ను చూసేందుకు భారీగా అభిమానులు, జనసైనికులు, ప్రజలు తరలిరావడంతో ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి.