Share News

కొరియర్‌లో గంజాయి రవాణా

ABN , Publish Date - Dec 19 , 2024 | 04:16 AM

పార్శిల్‌ సర్వీసు ద్వారా గంజాయి రవాణా చేస్తున్న వ్యవహారం విశాఖలో కలకలం రేపింది. శ్రీహరిపురం ఎంఐజీ క్వార్టర్స్‌లోని ఓ ఇంటిని కొంతమంది గ్లౌజ్‌ల వ్యాపారం కోసమంటూ ఆరు నెలల కిందట అద్దెకు తీసుకున్నారు.

కొరియర్‌లో గంజాయి రవాణా

ఢిల్లీకి పంపిన పార్శిళ్లు తిరిగిరావడంతో గుట్టురట్టు

మల్కాపురం, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): పార్శిల్‌ సర్వీసు ద్వారా గంజాయి రవాణా చేస్తున్న వ్యవహారం విశాఖలో కలకలం రేపింది. శ్రీహరిపురం ఎంఐజీ క్వార్టర్స్‌లోని ఓ ఇంటిని కొంతమంది గ్లౌజ్‌ల వ్యాపారం కోసమంటూ ఆరు నెలల కిందట అద్దెకు తీసుకున్నారు. అక్కడి నుంచే గంజాయి పార్శిల్స్‌ను డీటీడీసీ కొరియర్‌ ద్వారా ఢిల్లీకి పంపారు. వాటిపై చిరునామా సక్రమంగా లేకపోవడంతో వెనక్కివచ్చేశాయి. దీంతో కొరియర్‌ సిబ్బంది ఫోన్‌ చేసి పార్శిళ్లు వెనక్కి వచ్చిన విషయం చెప్పారు. ఆ పార్శిళ్లను పరిశీలించి, గంజాయి ఉందనే అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈలోగా పార్శిల్స్‌ తీసుకునేందుకు వచ్చిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అందులో ఏముందో తనకు తెలియదని, ఎంఐజీ క్వార్టర్స్‌లోని కొంతమంది కొరియర్‌ చేయాలని ఇచ్చినట్టు అతడు చెప్పాడు. దీంతో మల్కాపురం, టూటౌన్‌ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి క్వార్టర్స్‌లోని ఇంటిని పరిశీలించారు. ఎవరూ లేకపోవడంతో తలుపులు తెరిచిచూడగా, లోపల సుమారు 100 కేజీల గంజాయి మూటలు కనిపించాయి. దీంతో ఆ ఇంటిని సీజ్‌ చేశారు.

Updated Date - Dec 19 , 2024 | 04:16 AM